taraka ratna news : తారకరత్న చిన్న వయస్సులోనే చనిపోవడాన్ని ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత తారకరత్న ఫ్యామిలీకి పూర్తిగా దూరమయ్యారు. ఈ క్రమంలోనే తండ్రి మోహనకృష్ణ తన ఆస్తి మొత్తాన్ని తారకరత్న సోదరి రూప పేరు మీదనే రాశారని మీడియాలో టాక్ వినిపించింది.. ఇక తారకరత్న మరణం తర్వాత ఆయన ఆస్తులు బిజినెస్‌లపై చర్చ నడుస్తుంది.
తారకరత్నకు బంజారాహిల్స్, రోడ్ నెం. 12లో ‘కబారా డ్రైవ్ ఇన్’ పేరుతో రెస్టారెంట్ ఉండేదట. అయితే 2019లో జీహెచ్‌ఎంసీ అఫిషియల్స్ ఆ రెస్టారెంట్ కొంత భాగం కూల్చేశారట. అయితే విషయం తెలిసి వెంటనే స్పాట్‌కు చేరుకున్న తారకరత్న సమస్యేంటని అధికారులను ప్రశ్నించగా, వారు దానికి సమాధానంగా నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ బిజినెస్ నిర్వహిస్తున్నట్లు స్థానికులు కంప్లయింట్స్ ఇచ్చారని, ఇక్కడ లిక్కర్ కూడా సప్లయ్ చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని కొందరు ఫిర్యాదు చేసినట్లు వారు చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో కూల్చివేతకు సిద్ధం కావడంతో తారకరత్న అక్కడి ఫర్నిచర్, మెటీరియల్‌ను షిఫ్ట్ చేసేందుకు గాను అధికారుల పర్మీషన్ అడిగి కొంత టైమ్ తీసుకున్నాడు. అయితే అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
also read :