HomecinemaTaraka Ratna : తార‌క‌ర‌త్న న‌టించిన చివ‌రి చిత్రం ఏది.. ఎప్పుడు విడుద‌ల కాబోతుంది..!

Taraka Ratna : తార‌క‌ర‌త్న న‌టించిన చివ‌రి చిత్రం ఏది.. ఎప్పుడు విడుద‌ల కాబోతుంది..!

Telugu Flash News

Taraka Ratna: నంద‌మూరి హీరో తార‌క‌ర‌త్న ఊహించ‌ని విధంగా 39 ఏళ్ల వ‌య‌స్సులోనే క‌న్ను మూయ‌డం ప్ర‌తి ఒక్క‌రిని కలిచి వేస్తుంది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర కుప్పం నియోజకవర్గం వేదిక ప్రారంభం కాగా , ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు తారకరత్న కూడా పాల్గొన్నారు. పాదయాత్ర మొదలైన కాసేపటికి తారకరత్న జనాల్లో కుప్పకూలిపోగా, ఆయన్ని మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చేర్చారు. 23 రోజుల చికిత్స త‌ర్వాత ఆయ‌న క‌న్నుమూసారు.

తారకరత్న మరణం ప్రతి ఒక్కరినీ ఎంత‌గానో కలచి వేస్తుంది. మ‌రి కొద్ది రోజుల‌లో తార‌క‌ర‌త్న బ‌ర్త్ డేతో పాటు ఆయ‌న న‌టించిన చివ‌రి చిత్రం విడుద‌ల కానుంది. తార‌క‌ర‌త్న చివ‌రిగా ‘మిస్టర్ తారక్’ టైటిల్ తో ఓ క్రైమ్ థ్రిల్లర్ చేశారు.

ఈ చిత్రం ఫిబ్రవరి 24న విడుదల చేయాలని భావించ‌గా, ఇటీవ‌ల ట్రైలర్ కూడా విడుదల చేశారు. అయితే మిస్టర్ తారక్ విడుదలకు వారం రోజుల ముందు తారకరత్న కన్నుమూయ‌డంతో ఈ చిత్రం విడుదలని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు తెలియజేశారు.

also read :

Taraka Ratna: తార‌క‌ర‌త్న ప్రాణాలు పోవ‌డానికి ఆ చిన్న త‌ప్పే కార‌ణమా?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News