Tarakaratna: గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నకు సంబంధించి పలు విషయాలు ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తారక రత్న గురించి మరింతగా తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ శోధిస్తున్నారు.
ఈ క్రమంలో తారక రత్న లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.. తారక రత్న భార్య పేరు అలేఖ్య రెడ్డి. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో అలేఖ్య రెడ్డి తమ లవ్ స్టోరీ గురించి చెప్పారు.
‘‘తారక రత్న చెన్నైలోని మా సిస్టర్‌కి స్కూల్‌లో సీనియర్. ఆ తర్వాత ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా మేము హైదరాబాద్‌లో కలిశాం. కొన్నాళ్లు ఫ్రెండ్‌గా ఉన్నాం. తారక రత్న మొదట ప్రపోజ్ చేశారు. దాంతో నేను మా పేరంట్స్‌తో మాట్లాడమని సూచించాను. కానీ వాళ్లు ఒప్పుకోలేదు.
నందమూరి ఫ్యామిలీ కూడా వీరి పెళ్లికి ఒప్పుకోలేదట. కారణం.. నేను అప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నా. నేను కూడా మళ్లీ పెళ్లి చేసుకుంటానని అనుకోలేదు. ఆ సమయంలో మా అంకుల్ విజయసాయి రెడ్డి మాకు మద్దతుగా నిలిచారు.
మేము 2012, ఆగస్టు 2న సంఘీ టెంపుల్‌లో వివాహం చేసుకున్నాం. ఈ వివాహానికి ఇరు వైపు పెద్దలు ఎవరూ రాలేదు’’ అని గుర్తు చేసుకున్నారు. విజయసాయి రెడ్డి భార్య చెల్లెలు కుమార్తె ఈ అలేఖ్య రెడ్డి. వీరికి 2013లో నిష్కా అనే పాప పుట్టింది.
also read :
Roja Fire on Lokesh : లోకేష్‌ది ఐరన్ లెగ్.. చంద్రబాబుకు ప్రమాదం పొంచి ఉందన్న రోజా
H-1B Visa : స్కిల్డ్ ప్రొఫెషనల్స్‌కు ఢోకా లేదు.. మళ్లీ హెచ్1బీ వీసా అప్లికేషన్ల ప్రక్రియ షురూ!