Tarakaratna: గత వారం రోజులుగా తారకరత్న వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆయన్ను కాపాడేందుకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ డాక్టర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ స్వయంగా దగ్గరుండి తారకరత్నకు అందుతున్న వైద్యం గురించి తెలుసుకుంటున్నారు. హాస్పిటల్ వారు కూడా ఎప్పటికప్పుడుహెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నారు. అటు నందమూరి అభిమానులు తారకరత్న త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది..
ఈ క్రమంలో తారకరత్నను విదేశాలకు తీసుకువెళ్ళే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇక్కడి ట్రీట్ మెంట్ కు ఆయన కోలుకుంటే సరి.. లేకుండే పక్కాగా విదేశాలకు వెళ్తామంటున్నారు. తారకరత్న మెదడుకు స్కాన్ తీసినట్లు టీడీపీ హిందుపూర్ పార్లమెంట్ జనరల్ సెక్రటరీ అంబికా లక్ష్మీనారాయణ వెల్లడించారు. వచ్చే రిపోర్టులను బట్టి మెదడు పరిస్థితి ఎలా ఉందని తెలుస్తుందని, దాన్ని బట్టి కుటుంబసభ్యులు తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారని అన్నారు. ఇందుకు కోసం ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
also read:
Nara Lokesh పాదయాత్రలో ఉద్రిక్తత.. వెహికల్స్ సీజ్ చేసిన పోలీసులు
Baby in Brazil : బాలభీముడికి జన్మనిచ్చిన మహిళ! ఎంత బరువు ఉన్నాడంటే..