టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా తొలి రోజు చోటు చేసుకున్న అపశృతిలో స్పృహతప్పి పడిపోయిన సినీ నటుడు నందమూరి తారకరత్న (Tarakaratna) ప్రస్తుతం బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుప్పంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను తొలుత స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు. ఆయన పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
ఈ క్రమంలో ఆయనకు అత్యాధునిక ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని, నిపుణులైన వైద్య బృందంతో చికిత్స కొనసాగిస్తున్నట్లు సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా అక్కడి ఆస్పత్రి ప్రాంగణంలోనే ఉన్నారు. అయితే, తాజాగా నందమూరి తారకరత్న ఆరోగ్యంలోమార్పు లేకపోవడంతో విదేశాలకు తరలించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులు, బాలకృష్ణ సహా.. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ఆస్పత్రికి చేరుకొని చికిత్స అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి పలువురు ప్రముఖులు కూడా బెంగళూరు నారాయణ హృదయాలకు చేరుకొని తారకరత్న ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు.
తారకరత్నకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని నందమూరి రామకృష్ణ వెల్లడించారు. డాక్టర్ వైద్యానికి తారకరత్న స్పందిస్తున్నారని చెప్పారు. తారకరత్నకు మెదడుకు సంబంధించిన వ్యాధి సోకిందని, దానికి వైద్యం కొనసాగుతోందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా స్పష్టం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దగ్గరుండి చూసుకుంటున్నందుకు బాలకృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు విజయసాయిరెడ్డి. అవసరమైతే విదేశాలకు తరలించాలని కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
also read:
Gym : జిమ్‌కు వెళ్లే ముందు ఫుడ్ తీసుకోవాలా? నిపుణులు ఏమంటున్నారంటే!
Eesha Rebba Latest Photos in Yellow dress