Tarakaratna : హీరో నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయనను ఐసీయూలో ఉంచి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.
అయితే తారకరత్నకు మరో అరుదైన వ్యాధి కూడా ఉన్నట్లు బయట పడింది. ఆయనకు మేలేనా (Melena disease) అనే వ్యాధి ఉందని వైద్యులు గుర్తించారు. దానివల్ల చిన్నప్రేవులో రక్తస్రావం జరుగుతోందని చెబుతున్నారు.
ఈ వ్యాధి లక్షణాలున్న వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఆయన బాడీలో మల్టీఫుల్ గా ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుందని, అది కంట్రోల్ కావడం లేదని తెలుస్తుంది.
ఇప్పటికే నందమూరి బాలకృష్ణ సహా చంద్రబాబు వంటి వారు ఆయనను బెంగళూరు ఆసుపత్రిలో పరామర్శించారు.
ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఆయన భార్య ప్రణతి, కళ్యాణ్ రామ్ ఆయన భార్య శ్వేత కలిసి ఇప్పుడు బెంగళూరు బయలుదేరారు.
స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ లో బయలుదేరగా, హైదరాబాద్ ఎయిర్పోర్టులో వీరు ఫోటోగ్రాఫర్లు కంటికి చిక్కడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ కు తారకరత్న వరుసకు సోదరుడు అవుతాడు. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ సోదరుడు నందమూరి మోహన్ కృష్ణ కుమారుడే తారకరత్న.
also read:
Aryna Sabalenka: అవమానాలే నిచ్చెనమెట్లుగా చేసుకొని.. సబలెంకా విక్టరీపై ప్రశంసల వర్షం!