Taraka ratna: మంచి భవిష్యత్ ఉన్న నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న కన్నుమూసిన విషయం తెలిసిందే. కార్దియాక్ అరెస్ట్ తో ఆసుపత్రిలో చేరిన తారకరత్న సుదీర్ఘ కాలం చికిత్స తీసుకుంటూ కన్ను మూసారు. చూస్తుండగానే ఆయన మృతి చెంది మార్చి 18వ తేదీకి నెల రోజులు గడిచింది.
ఈ క్రమంలో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి (alekya reddy) తన సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. తన సందేశంలో అలేఖ్య తారకరత్నతో పరిచయం, ప్రేమ, పెళ్లి విషయాల గురించి ప్రస్తావించింది. అయిన వాళ్లే తమని ఇబ్బంది పెట్టారని, పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు ఎన్నో కష్టాలని చవి చూశామని పేర్కొంది తారకరత్న భార్య.
మన పెళ్లి నిర్ణయం అందరికీ దూరం చేసింది. మానసిక ఒత్తిడికి, ఆర్థిక ఇబ్బందులకి గురి చేసింది. కొందరి ద్వేషాన్ని చూడలేక మనం కళ్ళకు గంతలు కట్టుకోవల్సి వచ్చింది. పిల్లలు పుట్టాక మన జీవితం పూర్తిగా మారిపోయింది, సంతోషం నిండింది.
నువ్వు రియల్ హీరో, మళ్ళీ మనం కలుస్తామని ఆశిస్తున్నాను అంటూ చాలా భావోద్వేగంగా పోస్ట్ పెట్టింది. ఇక చివరిగా మామయ్య బాలకృష్ణ, పెదనాన్న విజయసాయి రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసింది అలేఖ్య రెడ్డి.
also read :
taraka ratna : చెప్పకుండానే తారకరత్న హోటల్ కూల్చివేశారా.. అసలు ఏం జరిగింది..!