Taraka Ratna : జనవరి 27న తారకరత్న కార్డియాక్ అరెస్ట్ కి గురయిన విషయం తెలిసిందే. ఆ రోజు నుండి తారకరత్నకి చికిత్స జరుగుతూనే ఉంది. గత 20 రోజులుగా తారకరత్నకు ఐసీయూలో వైద్యం జరుగుతుంది. ఆయన ప్రస్తుత కండీషన్ పై ఎలాంటి సమాచారం లేదు. నారాయణ హృదయాలయ వైద్యులు సమాచారం ఇవ్వడం లేదు. కుటుంబ సభ్యులు కూడా అరాకొరా సమాధానాలు మాత్రమే ఇస్తున్నారు. అయితే తాజాగా తారకరత్న మెదడుకు పరీక్షలు నిర్వహించారని సమాచారం. తల స్కాన్ చేశారని తెలుస్తుంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం తారకరత్న ప్రధాన అవయవాల తీరు మెరుగైంది. గుండె, కాలేయం, మూత్రపిండాలు సాధారణ స్థితికి వచ్చాయి. రక్త ప్రసరణ కూడా బాగానే ఉన్నా కూడా మెదడులో మాత్రం సమస్య అలానే ఉంది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా తారకరత్న మెదడుకు రక్త ప్రసరణ జరగలేదు. దాంతో మెదడు వాపుకు గురైంది. విదేశాల నుండి వచ్చిన న్యూరో వైద్యులు ఈ సమస్య నుండి తారకరత్నను బయటపడేసేందుకు కృషి చేస్తున్నారు. తారకరత్న కోమా నుండి బయటకు రాకపోవడానికి ప్రధాన కారణం ఇదే అని అంటున్నారు.
also read:
Maha Shivaratri : శివరాత్రి జాగారం నాడు ఏం చేయాలి? ఎలా చేస్తే శివానుగ్రహం సిద్ధిస్తుంది?
maha shivaratri : మహాశివరాత్రి రోజున చేయకూడని పనులు ఇవే.. పరమేశ్వర అనుగ్రహం కోసం ఇలా చేయండి..