Telugu Flash News

Taniya Bhatia : భారత మహిళా క్రికెటర్‌ తానియా భాటియాకు చేదు అనుభవం.. గ‌దిలోకి దూరిన ఆగంత‌కుడు…!

taniya bhatia

Taniya Bhatia: ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్ అద‌ర‌గొట్టిన విష‌యం తెలిసిందే. ఇంగ్లండ్ టీంని క్లీన్ స్వీప్ చేసి అదుర్స్ అనిపించింది. అయితే ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత మహిళా క్రికెటర్, వికెట్ కీపర్ తానియా భాటియా‌కు తాజాగా చేదు అనుభ‌వం ఎదురైంది.

ఓ అగంతకుడు ఆమె గదిలోకి దూరి బ్యాగును ఎత్తుకెళ్లాడు. అందులో డబ్బు, కార్డులు, వాచీతో పాటు నగలు కూడా ఉన్నాయట‌. ఈ విషయాన్ని తానియా సోషల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. భాటియా త‌న ట్విట్ట‌ర్‌లో .. ‘లండన్‌ మైదా వాలే మారియట్ హోటల్ మేనేజ్‌మెంట్‌ తీరుతో నేను షాక్ అయ్యాను.

చోరి జ‌రిగింది..

నేను టీంతో ఉండ‌గా, నా రూమ్‌లోకి దూరి ఎవ‌రో బ్యాగ్ దొంగిలించారు. ఇందులో డబ్బు, కార్డులు, వాచీలు, జ్యూవెలరీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏ మాత్రం సురక్షితంగా లేదు. దీనిపై వెంటనే విచారణ చేసి నా బ్యాగును తిరిగి అందిస్తారని ఆశిస్తున్నా.

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, తమ దేశంలో పర్యటించే క్రికెటర్లకు ఇలా భద్రత లేని హోటళ్లలో బస కల్పిస్తారని అస్స‌లు ఊహించ‌లేదు. నా బ్యాగుని త్వ‌ర‌గా తెచ్చి ఇవ్వండి అంటూ తానియా భాటియా కోరింది.

వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు క్లీన్ స్వీప్ కావ‌డంతో వారు ఇలాంటి ఘ‌ట‌న‌కు పాల్పడి ఉంటార‌ని అభిమానులు అనుమానిస్తున్నారు. కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తానియా భాటియాకు బదులుగా యష్తికా భాటియాని ఆడించింది టీమిండియా.

వచ్చే నెలలో ఆరంభం కానున్న ఆసియా కప్ 2022 మహిళల టోర్నీలో మాత్రం వికెట్ కీపర్ తానియా భాటియా ఆడ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇక ఇంగ్లండ్ గ‌డ్డ‌పై లెజండరీ ప్లేయర్ జులన్ గోస్వామికి ఘన వీడ్కోలు పలికిన విష‌యం తెలిసిందే.

Exit mobile version