Telugu Flash News

RRR: ఆర్ఆర్ఆర్ సినిమాపై త‌మ్మారెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు.. సంచ‌ల‌నంగా మారిన కామెంట్స్

rrr

RRR: ప్ర‌తిష్టాత్మ‌క అవార్డ్ ఆస్కార్ అందుకోవ‌డానికి ఆర్ఆర్ఆర్ చిత్రం ఓ అడుగు దూరంలో ఉంది. నిజంగా ఆస్కార్ వ‌స్తే అద్భుతం అనే చెప్పాలి. అయితే తాజాగా సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ప్రొడ్యూస‌ర్ త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఆర్ఆర్ఆర్ సినిమాపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. సినిమా మేకింగ్ అనే ఎలా మారింద‌నే ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా త‌మ్మారెడ్డి మాట్లాడుతూ.. ‘ఆస్కార్ ప్ర‌మోష‌న్స్ కోసం ఆర్ఆర్ఆర్ టీం 80 కోట్లు ఖర్చు చేశారు.

అదే 80 కోట్లు మాకు ఇస్తే ఓ 10 సినిమాలు తీసి వాళ్ళ మొఖాన కొడతాం అంటూ త‌మ్మారెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఉద్దేశంలో ఆర్ఆర్ఆర్‌ను కించప‌ర‌చాల‌నే ఉద్దేశం లేక‌పోయిన‌ప్ప‌టికీ ప్ర‌మోష‌న్స్ కోసం ఇంత ఖ‌ర్చు పెట్టారు అనే విధంగా మండి ప‌డ్డారు.

త‌మ్మారెడ్డి కామెంట్స్ ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మార‌గా, ఆయ‌న కామెంట్స్‌పై నెటిజ‌న్స్ ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. కాగా, ఆర్ఆర్ఆర్ సినిమాని దాదాపు ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైగానే ఖ‌ర్చు పెట్టి చిత్రీక‌రించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేష‌న్స్ స‌హా ప‌లు అంతర్జాతీయ అవార్డులు ద‌క్కాయి.

also read :

samyuktha menon Latest stills, Images, Photos 2023

Panasa Pottu Pulihora curry : పనసపొట్టు, పులిహొర కూర

moral stories in telugu : అబద్ధం ఆడరాదు.. ఆడితే నష్టం తప్పదు

Actress Honey Rose Latest pics, stills, photo gallery 2023

 

Exit mobile version