Homecinemaతమిళ హీరో విజయ్ ఆంటోని కి తీవ్ర గాయాలు.. షూటింగ్ లో ప్రమాదం

తమిళ హీరో విజయ్ ఆంటోని కి తీవ్ర గాయాలు.. షూటింగ్ లో ప్రమాదం

Telugu Flash News

తమిళ హీరో విజయ్ ఆంటోని (vijay antony) తమిళ చిత్రం పిచైక్కారన్ (pichaikkaran) , అలాగే తెలుగు డబ్బింగ్ సినిమా గా వచ్చిన బిచ్చగాడు చిత్రం తెలుగు తమిళ భాషల్లో సెన్సేషనల్ హిట్ అయిన విషయం మనకి తెలిసిందే. ఈ మూవీ తో విజయ్ ఆంటోనికి మంచి పాపులారిటీ వచ్చింది. బిచ్చగాడు సినిమా కు ముందు కూడావిజయ్ ఆంటోని కొన్ని చిత్రాల్లో నటించాడు. కానీ బిచ్చగాడు మూవీ వచ్చేవరకు విజయ్ ఆంటోని అంటే ఎవరో చాలా మందికి తెలియదు. ఈ సినిమా తర్వాత విజయ్ ఆంటోని ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

అయితే హీరో విజయ్ ఆంటోనికి తాజాగా ఓ దురదృష్ట సంఘటన మలేషియా లో జరిగింది. విజయ్ ఆంటోని తన నెక్స్ట్ మూవీ షూటింగ్ లో ప్రమాదవశాత్తూ గాయపడ్డారు. విజయ్ ఆంటోని ప్రస్తుతం బిచ్చగాడు 2(పిచైక్కారన్ 2) మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ మలేషియాలో జరుగుతోంది.

షూటింగ్ సమయంలో విజయ్ ఆంటోనీకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ అతడిని చికిత్స నిమిత్తం మలేషియాలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విజయ్ పరిస్థితి నిలకడగా ఉంది. ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. ఈ రాత్రికి విజయ్ ఆంటోని ఫ్యామిలీ మలేషియా వెళ్లబోతున్నట్లు తమిళ వర్గాలు చెబుతున్నాయి.

బోటులో ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హీరో విజయ్ ఆంటోని బోటులో ప్రయాణిస్తున్నాడు . ఒక కెమెరామెన్ మరియు ఇతర సిబ్బంది సమీపంలోని మరొక పడవలో చిత్రీకరిస్తున్నారు. వేగంగా వస్తున్న బోటు అదుపు తప్పి ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం విజయ్ ఆంటోని పూర్తిగా కొలుకునేవరకు షూటింగ్ ఆగినట్లే.. బిచ్చగాడు 2 మూవీ తిరిగి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే ఇపుడే చెప్పలేము. తన అభిమాన హీరో విజయ్ ఆంటోని త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

also read :

-Advertisement-

Fish and Milk : చేపలు తిన్న తర్వాత పాల పదార్థాలు తీసుకోవడం వల్ల చర్మ వ్యాధులు వస్తాయా ?

Viral video : తన జుట్టును ఇచ్చేసిన క్యాన్సర్‌తో పోరాడుతున్న మహిళ.. బార్బర్ ఏం చేశాడంటే!

Face oils for skin : ఫేస్‌ ఆయిల్స్‌తో నిగనిగలాడే చర్మ సౌందర్యం.. ఎలా వాడాలో తెలుసుకోండి..

Kohli: కోహ్లీకి సంక్రాంతి అంటే పూన‌కాలు లోడింగ్.. గ‌తంలోను..

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News