Nandi Awards : టాలీవుడ్ సినీ పరిశ్రమకు సంబంధించి అత్యున్నత పురస్కారాలుగా నంది అవార్డులని చెప్పుకొస్తుంటారు. ప్రభుత్వం ఇచ్చే ఈ అవార్డులకి చాలా గౌరవం ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఈ అవార్డుల ఊసే ఎవరు ఎత్తడం లేదు.
రీసెంట్గా కొందరు సినీ ప్రముఖులు ఈ విషయంపై పలు విమర్శలు చేశారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.
చిత్ర పరిశ్రమ నుంచి ఎవరూ గవర్నమెంట్‌కు ప్రతిపాదన పంపలేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పుకొచ్చారు. అవార్డులు ఇవ్వాలని ఎవరూ తమని అడగలేదని, ఎవరు పడితే వారు అడిగితే నంది పురస్కారాలు ఇవ్వమని ఆయన మాట్లాడారు.
కొందరు మీడియా కనిపిస్తే చాలు.. చాలా అత్యుత్సాహంగా మాట్లాడుతున్నారని తలసాని మండిపడ్డారు. వచ్చే సంవత్సరం రాష్ట్ర సర్కారు తరఫున నంది అవార్డులు ఇస్తామని చెప్పిన ఆయన, తెలుగు సినిమా ఇండస్ట్రీకి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని కూడా పలు కామెంట్స్ చేశారు.
also read :
Chiranjeevi: చిరంజీవితో రొమాన్స్ చేయాలని ఉందన్న కోరికని బయటపెట్టిన ఖుష్బూ
Dimple: రామబాణం హీరోయిన్‌కి గుడి కడతానన్న అభిమాని.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన డింపుల్