child care :
- సెలవుల్లో పిల్లలకు కథల పుస్తకాలు కొనివ్వాలి.
- ఎండు ఖర్జూరాలు రాత్రి నీటిలో నానబెట్టి తెల్లవారి త్రాగిస్తే పిల్లలకు ఎంతో చలువ.
- వీరికి ఐస్‌క్రీమ్స్ బదులు నిమ్మరసాన్ని, కొబ్బరి బొండాలిని ఇస్తే ఆరోగ్యం.
- పిల్లల పాదాల్లో ముల్లు గుచ్చుకుంటే అక్కడ కొద్దిసేపు ఐసు ముక్కను ఉంచి ముల్లు తీస్తే నొప్పి తెలియదు.
- పిల్లలను నోట్‌బుక్స్ లోని కాగితాలు చించే అలవాటు నుంచి దూరం చెయ్యాలి..
- ఆటలకు పనికిరాని పేపర్లను వాడుకోమనాలి.
- పిల్లలను అతిగా కొట్టరాదు, తిట్టరాదు.
- పిల్లలకు చాక్ లెట్లు, బిళ్ళలు, కేడ్ బరీస్ తినటం చెడ్డ అలవాటు అని, ఆరోగ్యానికి హాని అని వివరించి చెప్పాలి.
- అతిగా స్వీట్లు తినిపించకూడదు. పిప్పిపళ్ళు వస్తాయని, వాటి వల్ల వచ్చే బాధ, ఇబ్బందులు తెలియ చెప్పాలి.
- పిల్లలు పళ్ళ నొప్పితో బాధపడుతుంటే గ్లిజరిన్‌తో 2, 3 సార్లు రుద్దితే సరిపోతుంది.
- పిల్లలను ఇతరులతో పోల్చే అలవాటు మంచిది కాదు. అది వారిలో ఆత్మన్యూనతా భావాన్ని పెంచుతుంది.
- ఎండా కాలంలో కళ్ళు ఎరుపెక్కితే మజ్జిగలో ముంచిన దూదిని పడుకునేటప్పుడు కనురెప్పలపై అద్దాలి.
- పిల్లలను చిరు తిండ్లకు అలవాటు చెయ్యకూడదు.
- పిల్లల పెరుగుదలకు, ఎముకలు గట్టిపడటానికి తరచుగా కాల్షియం ఇస్తుండాలి.
- చపాతీ కోసం కలిపిన గోధుమపిండి ముద్దను కొంచెం వారి చేతుల్లో పెట్టి వివిధ ఆకృతులలో చిన్న చిన్న బొమ్మలు చెయ్యటం నేర్పాలి.
- క్రిమికీటకాల కాటుతో శిశువులకు వచ్చే దద్దుర్లపై విభూతి రాస్తే దురద ఉండదు.
- వేసవిలో పిల్లలకు దాహం వేసినప్పుడల్లా చక్కెర, ఉప్పు, కలిపిన నీటిని ఇస్తే జీర్ణకోశం దెబ్బతినకుండా ఉంటుంది.
- పిల్లలు గాలిపటాలు ఆడేటప్పుడు కరెంటు స్తంభాలను తాకకుండ చూడాలి.
- వడదెబ్బ తగిలితే పిల్లలకు తడిగుడ్డతో ఒళ్ళంతా తుడిచి ఉప్పు కలిపిన నీరు త్రాగించాలి.
- వికలాంగులను పరిహసించటం అంత పిచ్చిపని మరొకటి ఉండదని వారికి చెప్పాలి.
- పిల్లలు ఎండబారినపడకుండా ఉండాలంటే క్యారమ్స్, చెస్ లాంటి ఇండోర్ గేమ్స్ ని అలవాటు చేయాలి.
- కళ్ళు ఎర్రబారితే గ్లాసులో చిటికెడు ఉప్పు వేసి ఆ నీటిలో కళ్ళను లోపలికంటూ కడగాలి.
- వేసవిలో మంచినీళ్ళ బదులు పళ్ళరసాన్ని ఇస్తే ఎంతో మంచిది.
- బెలూన్‌లో పూలరేకులుంచి బూర తయారు చేసి కడితే అది పగలగానే అవి అన్ని జల్లులా పడటం వారికి థ్రిల్ కలిగిస్తుంది.
- పిల్లలు చిన్నతనం నుంచే ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని ఏర్పరుచుకోవాలి. భయాన్ని పోగొట్టుకోవాలి. అవే వారి విజయానికి మెట్లు.
- పిల్లల్ని ఎప్పుడూ మాట్లాడనిస్తూ ఉండాలి. దీనివల్ల వారిలో కొత్తవారి పట్ల బెరుకుపోతుంది. ఒక్కోసారి వారి భావాలు. మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి.
- పిల్లలను గుక్క తిప్పకుండా నవ్వించకూడదు. అలా చేస్తే ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరవుతారు.
- పిల్లలకు చిన్నప్పటి నుంచీ ఏవస్తువును ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టే అలవాటు చెయ్యాలి.
- పిల్లలకు రకరకాల సందేహాలు వస్తాయి. వాటిని తీర్చడానికి ప్రయత్నించాలి. కసురుకోవడం మంచిది కాదు.
- పిల్లలు స్కూలు నుంచి రాగానే వారి వారి బ్యాగ్‌లు, షూస్, డ్రస్ ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో పెట్టుకునే అలవాటు. చెయ్యాలి..
- కొత్తగా స్కూల్లోకానీ, హాస్టల్లోకానీ చేర్పించినప్పుడు వారితోపాటు, వారి స్నేహితులను, వారి అలవాట్లును గమనించాలి.
- ప్రేమ ఎప్పుడూ తెల్లని చందమామలా స్వచ్ఛంగా ఉండాలని చెప్పాలి.
- వదంతులను నమ్మరాదని, ఇతరులకు అలాంటివి కల్పించి చెప్పకూడదని పిల్లలకు విడమరిచి చెబుతూ వాటి ఇబ్బందులను కూడా వారికి వివరించాలి.
- ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు బజారులో కొనుక్కొంటే వచ్చేవి కావని, సాటి మనుషుల నుంచి అడగకుండా ఇచ్చి పుచ్చుకొనేవి అని నొక్కి చెప్పాలి.
- ఎదుటి వ్యక్తిలో మంచిని గ్రహించే శక్తి పిల్లలలో ఏర్పడేలా చేసే బాధ్యత తల్లిదండ్రులదే !
- మోసం చేసే నైజం బహు చెడ్డదని పిల్లలు గ్రహించేలా చేయాలి.
- అబద్దాలు ఆడటం అంత హీనమైన పని మరొకటి ఉండదని తెలియజేయాలి.
- పిల్లలు మహోన్నత వ్యక్తులనే ఆదర్శంగా తీసుకునేట్లు చూడాలి.
- కలహాలకు కడు దూరంగా ఉండమనాలి.
- కలిసి ఉంటే కలదు సుఖమని వారే మరొకరికి చెప్పేలా తయారు చెయ్యాలి.
also read :
Kushi : సమంత – విజయ్ చిత్రానికి ‘ఖుషి’ టైటిల్ వాడడం వెనక అసలు కారణం తెలుసా ?
moral stories in telugu : ఇద్దరు ఇల్లాళ్ళు.. కథ చదవండి
Millets : వేసవిలో ఏయే చిరుధాన్యాలు తింటే ఆరోగ్యానికి మంచిదంటే..