పంజాబీ బ్యూటీ తాప్సీ పన్ను బాలీవుడ్లో విభిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సంపాదించుకుంది. తన శృంగార జీవితం గురించి ఈ బ్యూటీ ఇటీవల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేసిందో వివరాల్లోకి వెళితే..ప్రస్తుతం తాప్సీ పన్ను ‘దొబారా’ సినిమా ఆగస్ట్ 19న విడుదల కానుంది.తాప్సీ పన్ను ‘కాఫీ విత్ కరణ్’కి ఎందుకు వెళ్లలేదనేది బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ నేపథ్యంలోనే ఆమెకు ఓ ప్రశ్న ఎదురైంది. ‘మీ సినిమా ప్రమోషన్ కోసం కాఫీ విత్ కరణ్ షోకి ఎందుకు వెళ్లలేదు’ అని ఓ రిపోర్టర్ అడిగాడు. “కాఫీ విత్ కరణ్‌కి ఆహ్వానించేంత ఆసక్తికరంగా నా రొమాంటిక్ లైఫ్ లేదు” అని ఆమె వ్యంగ్యంగా సమాధానం ఇచ్చింది. ఆమె సమాధానానికి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. కరణ్ షోపై ఆమె పరోక్షంగా కౌంటర్ వేసినట్లు చర్చ జరుగుతోంది.
మరిన్ని వార్తలు చదవండి