HomesportsT20: టీమిండియా కొత్త జెర్సీ విడుద‌ల‌.. ఇందులో మూడు స్టార్స్ వెనుకు ఉన్న క‌హానీ ఏంటో తెలుసా?

T20: టీమిండియా కొత్త జెర్సీ విడుద‌ల‌.. ఇందులో మూడు స్టార్స్ వెనుకు ఉన్న క‌హానీ ఏంటో తెలుసా?

Telugu Flash News

T20: ఇటీవ‌ల జ‌రిగిన ఆసియా క‌ప్‌లో నిరాశ‌ప‌ర‌చిన టీమిండియా మ‌రి కొద్ది రోజుల‌లో మొద‌లు కానున్న వ‌ర‌ల్డ్ క‌ప్‌లో విజ‌య ప‌తాకం ఎగుర‌వేయాల‌ని ఉత్సాహంగా చూస్తుంది. అయితే ఆస్ట్రేలియాలో జ‌ర‌గ‌నున్న ఈ మ్యాచ్‌ల కోసం భారత జట్టు కొత్త జెర్సీ (team india new jersey 2022) ని విడుదల చేశారు.

ముంబైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జెర్సీని విడుదల చేయ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి కొంద‌రు టీమిండియా ఆట‌గాళ్లు కూడా హాజ‌ర‌య్యారు. 2007లో నీలిరంగుతో కూడిన జెర్సీ (Blue jersey) లు ధరించి భార‌త్ టీ 20 ప్రపంచ కప్ ను గెలుచుకున్న విష‌యం తెలిసిందే.

స్టార్స్ వెనుక సీక్రెట్ ఇదే..

కొత్త జెర్సీలో మూడు నక్షత్రాలు మ‌న‌కు క‌నిపిస్తున్నాయి. త్రీ స్టార్‌ల వెనుక ఉన్న సీక్రెట్ ఏంటంటే భారత జట్టు ప్రపంచ క‌ప్‌ మూడుసార్లు గెలుచుకున్నందుకు గుర్తు. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది.

ఆ త‌ర్వాత , టీ20 ప్రపంచకప్ తొలి సీజన్‌లో, మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో భారత జట్టు రెండవసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఇక 2011లో మహేంద్రసింగ్‌ ధోనీ సారథ్యంలో భారత జట్టు మూడోసారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఈసారి ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు నాలుగోసారి ప్రపంచకప్ గెలవాలనే సంకల్పంతో బరిలోకి దిగుతుంది.

ఈసారి టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియాలో జరుగనున్న విష‌యం తెలిసిందే.. ఎలాగైనా టీ20 వరల్డ్ కప్ ను సాధించాలన్న సంకల్పంతో టీమ్ ఇండియా సభ్యులున్నారు.

-Advertisement-

టీ 20 ప్రపంచ కప్ కు ముందు టీమిండియా.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లతో టీ 20 సిరీస్ లను ఆడనుండ‌గా, ఇవి వ‌ర‌ల్డ్ క‌ప్‌కి ముందు మంచి ప్రాక్టీస్ లా ఉపయోగపడుతాయని బీసీసీఐ భావిస్తోంది. ఇక వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ త‌న తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తో ఆడ‌నుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News