T20 World Cup: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుండి టీ 20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ చాలా ఆసక్తికరంగా సాగనుండగా, ఈ సారి వరల్డ్ కప్ ఎవరు సాధిస్తారా అనే ఆతృత అందరిలో ఉంది. ఇక మెగా టోర్నీ ముందు ఐసీసీ అన్ని జట్లకి కొన్ని రూల్స్ విడుదల చేసింది. మ్యాచ్ ఆడేవారు వీటిపై ఓ కన్నేసి ఉంచడం మంచిదని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఐసీసీ ఇలా సూచించడం వెనక కారణం ఇటీవల భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ చేసిన మాన్కడింగ్. ఈ వివాదంపై తీవ్ర స్థాయిలో చర్చకు రావడంతో ఐసీసీ క్లారిటీ ఇచ్చింది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
1. రనౌట్ (మాన్కడింగ్): బౌలర్ బంతిని విసరక ముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని బ్యాటర్ క్రీజుని దాటి వెళితే బౌలర్ రనౌట్ చేవచ్చు. అప్పట్లో ఔట్ చేయడాన్ని మాన్కడింగ్ అనేవారు. కానీ ఇకపై దాన్ని ‘రనౌట్’గా పరిగణిస్తారు.
2. స్లో ఓవర్ రేట్:బౌలింగ్ టీమ్ కేటాయించిన సమయంలోపు నిర్ణీత ఓవర్లని పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ అలా చేయడం లేదు. జరిమానాలు విధించిన మార్పులు రావడం లేదు. దీంతో 30 యార్డ్ సర్కిల్ వెలుపల లాస్ట్ ఓవర్‌లో ఒక ఫీల్డర్‌ని తగ్గించనున్నారు. ఇది ఫీల్డింగ్ టీమ్‌కి చివర్లో పెద్ద ఇబ్బందిగా మారనుంది.
3. కొత్త బ్యాటర్‌కే స్ట్రైక్: ఇందులో కొత్త మార్పు కనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితులో అయిన క్రీజ్ లోకి కొత్త బ్యాటర్ వస్తే అతనే స్ట్రైకింగ్ తీసుకోవాలి. ఫీల్డర్ క్యాచ్ పట్టక ముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని బ్యాటర్.. స్ట్రైక్ ఎండ్ బ్యాటర్‌ని పిచ్ మధ్యలో క్రాస్ చేసినా సరే.. కొత్తగా వచ్చే బ్యాటర్ మాత్రమే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.
4. ఫీల్డర్ అసందర్భ కదలికకి జరిమానా: బౌలర్ బంతిని వేసేప్పుడు ఫీల్డర్ కదలకూడదు. అలా కదిలినట్టు తేలితే ఫీల్డింగ్ టీమ్‌కి ఐదు పరుగుల పెనాల్టీ విధించి.. ఆ పరుగుల్ని బ్యాటింగ్ టీమ్ స్కోరు బోర్డుకి కలుపుతామని సూచించారు. అయితే ఇక్కడ చిన్న వెసులు బాటుఉంది. బ్యాటర్ బంతిని వేయకముందు అటు ఇటు కదిలినట్టు చేస్తే అందుకు తగ్గట్టు ఫీల్డర్ కూడా కదలవచ్చు. అసందర్భంగా కదిలితే మాత్రం పెనాల్టీ తప్పదు.