HomesportsT20 World cup: వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌డం క‌ష్టమేనా.. విజేతను ఎలా తేలుస్తారు..!

T20 World cup: వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌డం క‌ష్టమేనా.. విజేతను ఎలా తేలుస్తారు..!

Telugu Flash News

T20 World cup: ర‌స‌వత్త‌రంగా సాగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2022 తుది ద‌శ‌కు చేరుకుంది. ఆదివారం జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌తో ఇది ముగియ‌నుంది. న్యూజిలాండ్‌ని చిత్తు చేసి పాకిస్తాన్ ఫైన‌ల్‌కి వెళ్లగా, ఇండియాని ఓడించి ఇంగ్లండ్ ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది. ఈ రెండు జట్లు ప్రతిష్టాత్మక మెల్ బోర్న్ వేదికగా టైటిల్ ఫైట్‌లో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. 1992 వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఇదే వేదికపై తలపడగా.. పాక్ విజేతగా నిలిచిన విష‌యం తెలిసిందే. మళ్లీ అదే ఫలితాన్ని రిపీట్ చేయాలని పాక్ జట్టు భావిస్తుండగా.. లెక్క సరిచేయాలని ఇంగ్లండ్ క‌సితో ఉంది.

ఎవ‌రు విజేత‌..

అయితే ఫైన‌ల్ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉన్న‌ట్టు తెలుస్తుంది.. రిజర్వ్ డే ఉన్నా కూడా ఆ రోజునా వర్షం పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లో లానినా ప్రభావంతోచాలా వర్షాలు పడుతున్నాయి. మెల్‌బోర్న్‌లో ఆదివారం, సోమవారం వర్షం పడే అవకాశాలు 95 శాతం ఉన్నాయని అక్కడి వాతావరణ శాఖ చెబుతుంది.. ‘ఆదివారం ఉరుములు, మెరుపులతో 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వొచ్చని అంచనా వేశారు. ఇక సోమవారం కూడా 5 నుంచి 10 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంద‌ని మెల్‌బోర్న్‌ మెటరాలజీ బ్యూరో వెల్లడించింది.

టోర్నమెంట్ నిబంధనల ప్రకారం.. సాధ్యమైనంత వరకు తక్కువ ఓవర్లకు కుదించైనా మ్యాచ్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, కనీసం 10 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆదివారం మ్యాచ్‌ మొదలై వర్షం కారణంగా ఆగిపోతే.. రిజర్వ్‌డే రోజున మిగతా ఆట జ‌రుగుతుంది. రిజర్వే డే రోజునా మ్యాచ్‌ను కొనసాగించే పరిస్థితి అస్సలు లేనప్పుడు.. ఇరు జట్లు టైటిల్‌ను పంచుకుంటాయి. వన్డే ప్రపంచకప్‌- 2019 సెమీఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో.. భారత్‌, న్యూజిలాండ్ మ్యాచ్‌ రెండు రోజులు జరిగిన విష‌యం గుర్తుండే ఉంటుంది. ఈ సారి చాలా మ్యాచ్‌లు వ‌ర్షార్ప‌ణం అయి ఫ‌లితాల‌పై పెద్ద ఎఫెక్ట్ చూపించాయి.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News