HomehealthSweet potato health benefits : స్వీట్‌ పొటాటో.. ప్రయోజనాలు ఎన్నో!

Sweet potato health benefits : స్వీట్‌ పొటాటో.. ప్రయోజనాలు ఎన్నో!

Telugu Flash News

Sweet potato health benefits : స్వీట్‌ పొటాటో, కందగడ్డ, మొరంగడ్డ, చిలగడ దుంప.. పేరు ఏదైనా సరే, ఇదంటే అందరికీ చాలా ఇష్టం. వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అపారమైనవి.

స్వీట్ పొటాటోలో శరీరానికి మేలు చేసే విటమిన్ సి, ఇ, బి-6, బీటా కెరోటిన్, పొటాషియం, ఐరన్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాల సామర్థ్యాన్ని పెంచి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరాకు దోహదం చేస్తాయి. తెల్లరక్తకణాల ఉత్పత్తిలో ఈ దుంపల్లోని పోషకాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్-సి శీతాకాలంలో జలుబు, ఫ్లూ వంటి సమస్యలను దూరం చేస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వైద్యుల సలహాతో లిమిట్ గా తినవచ్చు. ఈ దుంపలు తియ్యగా ఉంటాయి కానీ చక్కెరను నియంత్రిస్తాయి. స్వీట్ పొటాటోలో క్యాన్సర్ తో పోరాడే గుణాలు ఉన్నాయి. వీటిలో ఉండే పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. మెగ్నీషియం ధమనులకు మంచిది.

ఈ స్వీట్‌ పొటాటో లలో గాయాలను త్వరగా మాన్పించే ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించి, అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. చిలగడదుంప చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు సమస్యలకు ఇది మంచి పరిష్కారం. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.

also read :

minapa garelu : కరకరలాడే వేడివేడి మినప గారెలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసా ?

-Advertisement-

moral stories in telugu : ఎవరు గొప్ప? జ్ఞానమా.. అదృష్టమా..?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News