sushanth : అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన ఎన్నో జానర్ సినిమాలు చేసి ప్రేక్షకులని మెప్పించారు. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్న నాగ్ సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. ప్రస్తుతానికి అక్కినేని హీరోల సినీ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. నాగార్జున దగ్గర నుంచి నాగ చైతన్య అఖిల్ వరకు హిట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు, చాలా కష్టపడ్డారు. అయిన సరే ఆడియన్స్ ని మెప్పించలేకపోతున్నారు.
ఇక సుమంత్, సుశాంత్ ల సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిగతా హీరోలన్నా ఇంకా ప్రయత్నాలు చేస్తుంటే సుశాంత్ మాత్రం సైడ్ హీరోగా టర్న్ తీసుకొని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.. అల వైకుంఠపురములో సినిమాలో సైడ్ హీరోగా చేసిన పాత్రకి మంచి గుర్తింపు దక్కడంతో అదే తరహాలో వరుసగా చేస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా రవితేజ రావణాసుర సినిమాలో కూడా సుశాంత్ కనిపించి మెప్పించాడు.
ఇక ప్రస్తుతం సుశాంత్.. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో కీర్తి సురేష్ చిరుకి చెల్లెలుగా కనిపిస్తుండగా ఆమెను పెళ్లాడే వ్యక్తిగా సుశాంత్ నటిస్తున్నాడని టాక్.. సుశాంత్ హీరోగా ఇంకా ఒక బలమైన ముద్ర వేయలేకపోవడంతో సైడ్ రోల్స్ చేస్తున్నాడు. అవి కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వట్లేదు.
అయితే ప్రస్తుతం చేస్తున్న మెగా సినిమా మీదే తన ఆశలన్నీ సుశాంత్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఎలాగైనా సరే ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్ ని మెప్పించి తను సోలోగా చేసే సినిమాలతో కూడా మెగా ఫ్యాన్స్ మెప్పు పొందాలని ఎంతో ప్రయత్నిస్తున్నాడట సుశాంత్. ఓ విధంగా సుశాంత్ ప్రయత్నం మెచ్చుకోదగినదే అయినా అక్కినేని హీరోలకే ఇలా ఎందుకు జరుగుతుంది అంటూ ఫ్యాన్స్ మాత్రం తెగ ముచ్చటించుకుంటున్నారు.
కేవలం హీరోగానే చేస్తా మిగతా రోల్స్ తను చేయను అన్నట్టుగా ఉంటే ఆయన కెరీర్ పూర్తిగా డ్రాప్ అవుతుంది. ఈ క్రమంలో సుశాంత్ తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే.. చిరు భోళా శంకర్ తో సుశాంత్ అనుకున్న సక్సెస్ సాధిస్తే మాత్రం రానున్న రోజులలో మంచి సినిమాలు చేసి అలరించే ప్రయత్నం చేయవచ్చు. చిరు సినిమాలో సుశాంత్ రోల్ క్లిక్ అయితే ఇక నుంచి అతనికి లక్ కలిసి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక మిగతా అక్కినేని హీరోలు నాగ చైతన్య, అఖిల కూడా ఇటీవల దారుణమైన పరాజయాలు చవి చూశారు. ఏజెంట్, కస్టడీ చిత్రాలు దారుణంగా నిరాశపరిచాయి.
మరిన్ని వార్తలు చదవండి :
తెలంగాణ వార్తలు | జాతీయ వార్తలు | సినిమా వార్తలు | అంతర్జాతీయ వార్తలు | ఆరోగ్య చిట్కాలు