HomesportsSuryakumar Yadav: ఫ‌న్నీ మూమెంట్‌.. అవార్డ్ ఇచ్చే దాక ఆగ‌లేక‌పోయిన సూర్య‌.. రియాక్ష‌న్ చూడండి..!

Suryakumar Yadav: ఫ‌న్నీ మూమెంట్‌.. అవార్డ్ ఇచ్చే దాక ఆగ‌లేక‌పోయిన సూర్య‌.. రియాక్ష‌న్ చూడండి..!

Telugu Flash News

Suryakumar Yadav:  టీమిండియా మిస్ట‌ర్ 360 సూర్య‌కుమార్ యాద‌వ్ పాకిస్తాన్‌పై నిరాశ‌ప‌ర‌చిన కూడా నెదర్లాండ్స్‌పై అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. 204 స్ట్రైక్ రేట్‌తో 25 బంతుల్లో 51 పరుగులు చేశాడు సూర్య‌.

నెదర్లాండ్స్ బౌలర్లపై దండయాత్ర చేస్తూ, ఫలితంగా ఎన్నో కొత్త రికార్డులు సృష్టించడంతో పాటు ప్రపంచ రికార్డు కూడా బద్దలు చేశాడు. 2022లో ఐదవసారి స్ట్రైక్ రేట్ 200 ప్లస్ దాటించ‌డంతో, ఒకే ఏడాదిలో ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా సూర్య‌ నిలిచాడు.

ఈ ఏడాది 25 మ్యాచ్‌ల్లో 867 పరుగులు చేయ‌గా, టీ 20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. నెద‌ర్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడ‌డంతో సూర్య ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

అయితే, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకునే సమయంలో ఓ ఫన్నీ ఘటన చోటు చేసుకుంది..

ఫన్నీ రియాక్ష‌న్..

ఓ అభిమాని చేతుల మీదుగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకునేందుకు సూర్యకుమార్‌ రెడీ అయ్యాడు. హోస్ట్ అందుకు సంబంధించిన వివరాలను పూర్తి చేయకముందే.. అవార్డు తీసుకునేందుకు సిద్ధమవుతూ చేతులు ముందుకు చాచాడు సూర్య.

ఫ్యాన్ నుంచి స్పందన లేకపోవడంతో ‘లావో భయ్యా దో’ (సోదరా ఇలా ఇచ్చెయ్) అని అడ‌గ‌డంతో అప్పుడు వారి రియాక్షన్ చూసి ఆ ఫ్యాన్‌తో పాటు అక్కడున్న వారు తెగ‌ నవ్వుకున్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

-Advertisement-

నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలు చేసిన విష‌యం తెలిసిందే.

వీరి ముగ్గురిలో సూర్య ఇన్నింగ్స్ స్పెష‌ల్. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టిన సూర్య.. 25 బంతుల్లో అర్ధ శతకం నమోదు చేశాడు. లాస్ట్ బాల్‌ను సిక్స్‌గా మలిచి సూర్య హాఫ్ సెంచరీ చేయగానే.. విరాట్ సంబరాలు చేసుకున్నాడు.

సహచర బ్యాట్స్‌మెన్‌ను అభినందిస్తూ విరాట్.. తెగ ఎంజాయ్ చేశాడు. ఇక నెదర్లాండ్స్‌పై 25 బంతుల్లో 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సూర్య.. ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా స‌రికొత్త రికార్డ్ సృష్టించాడు.

పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌ (825 రన్స్)ను వెనక్కి నెట్టిన సూర్య (861).. ఈ ఏడాది టీ20ల్లో 180కిపైగా స్ట్రయిక్ రేట్‌‌తో ప‌రుగులు రాబ‌ట్టాడు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News