ఇటీవలి కాలంలో సూర్య కుమార్ యాదవ్ (surya kumar yadav) పేరు తెగ మారు మ్రోగిపోతుంది. ఆడిన ప్రతి మ్యాచ్‌లోను తన ప్రతిభ చూపిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో మూడు హాఫ్ సెంచరీలు బాదిన సూర్య.. న్యూజిలాండ్ పర్యటనలోనూ అదే జోరును కొనసాగిస్తున్నాడు. ఆదివారం జరిగిన రెండో టీ20లో ఏకంగా అజేయ శతకం సాధించాడు. 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 111 పరుగులతో అజేయంగా నిలిచిన సూర్య కుమార్ యాదవ్… 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, మరో 17 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడంటే ఆయన ఇన్నింగ్స్ ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు.
అయితే తను ఇలా నిలకడగా రాణించడానికి గల కారణాన్ని సూర్య వెల్లడించాడు. తన సతీమణి దెవిషా శెట్టి తన సక్సెస్ సీక్రెట్ అంటున్నాడు. తన తల్లిదండ్రులతో రోజు ఓ అరగంట మాట్లాడుతా, ఫ్యామిలీతో చాలా ప్రశాంతంగా ఉంటాను. వారి మాటలు తనను ఒదిగి ఉండేలా చేస్తాయని అన్నాడు సూర్య. ఇక ‘నేను ఎప్పుడూ నా జోన్‌లోనే ఉండేందుకు ప్రయత్నిస్తాను. అలానే నా సతీమణి ఎప్పుడూ నాతో ఉంటుంది. ఆఫ్ డేలో ఆమెతోనే గడుపడం, మ్యాచ్ లేని రోజు సరదాగా ఆమెతో బయటకు షికారుకు వెళ్లడం చేస్తాను. ఈ ప్రక్రియ నా లైఫ్‌లో ప్రతి రోజు జరుగుతుంది. అదే నేను నిలకడగా రాణించడానికి ఉపయోగపడుతుంది’ అని సూర్య తెలియజేశాడు.
గతంలో సైతం బాగా ఆడినా కూడా టీమిండియా నుంచి టెస్ట్ మ్యాచులకు పిలుపు రాకపోవడంతో కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాడు. మెరుగైన క్రికెటర్ గా మారే క్రమంలో సూర్య తనను తాను ఎంతో మార్చుకుంటున్నాడు. ఆహార అలవాట్లు, ప్రాక్టీసు విషయంలో తగిన శ్రద్ధ తీసుకుని బంతిని ఎలా బాదాలో కూడా సరైన విధంగా ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నాడు.. మ్యాచ్ అయిపోయాక హైలైట్స్ చూసి తన బ్యాటింగ్ లో ఇంకా ఏవైనా మార్పులు చేసుకోవాలా అని ఎప్పటికప్పుడు విశ్లేషణలు చేసుకుంటాడట. తన వల్ల ఎలాంటి నష్టం కలగొద్దని , మైదానంలో చురుకుగా కదులుతాడు. కోహ్లితో ఉన్న అనుబంధం కారణఃగా ఇద్దరు కలిసి తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఇవి సూర్య సక్సెస్‌లో సీక్రెట్స్ అని తెలుస్తుంది.