Telugu Flash News

సుధ కొంగర – సూర్య కాంబినేషన్​లో మరో సినిమా!

sudha kongara surya movie

తమిళ దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వం వహించిన తమిళ సినిమా సూరరై పొట్రు , అలాగే తెలుగు లో ‘ఆకాశం నీ హద్దురా’ గా రిలీస్ చేశారు. ఆ చిత్రం ఘన విజయం సాదించడం తో సుధ కొంగర కి చాలా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆ మహిళా దర్శకురాలు మరే ఇతర సినిమా తీస్తున్నట్టు ప్రకటించలేదు. తన తర్వాతి చిత్రాల గురించి కూడా ప్రస్తావన లేదు.

ఇటీవల దర్శకురాలు సుధ ఒక న్యూస్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన తదుపరి చిత్రం కూడా సూర్య తోనే ఉంటుందని తెలిపారు. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఇది ముందు సినిమా లాగా బయోపిక్ కాదని, కానీ ఇది ఒక యదార్థ సంఘటన అని చెప్పారు.

ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారని సమాచారం. 2022 చివరిలో ఈ మూవీ షూటింగ్ మొదలు కానుంది. ఈ ముగ్గురి కాంబినేషన్ లో మరొక బ్లాక్ బస్టర్ మూవీ కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఆసక్తికరమైన వార్తలు చదవండి :

ప్రత్యేకంగా హిందీ సినిమా చేయనవసరం లేదు : మహేష్ బాబు

‘కృష్ణ వ్రింద విహారి’ అప్డేట్ ..మొదటి పాట ఎప్పుడంటే ?

Exit mobile version