Bigg Boss 6: బుల్లితెర బిగ్ బాస్ షో రోజు రోజుకి రంజుగా మారుతుంది. కంటెస్టెంట్స్ తగ్గుతున్న కొద్ది హౌజ్‌లో ఫైట్ ఎక్కువ అవుతుంది. 56 వ రోజు బిగ్ బాస్ హౌజ్‌లో సందడి మాములుగా లేదు.
ముందుగా శనివారం సూర్యని ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చిన నాగార్జున ఆదివారం మొదట్లో అతనితో కలిసి హౌజ్‌మేట్స్ తో మాట్లాడించాడు. ముందుగా తన జర్నీ చూసిన సూర్య ఎమోషనల్ అయ్యాడు.
ఇక అనంతరం ఆర్జే సూర్యతో `ఫైర్`, `ఫ్లవర్` ఎవరో చిన్న గేమ్ ఆడించారు. దీంతో రేవంత్, గీతూ, శ్రీహాన్, బాలాదిత్య ఫ్లవర్స్ అని, అన్నారు.. రేవంత్ ఆవేశం తగ్గించుకోవాలని, గీతూ తన గేమ్ తాను ఆడాలని, శ్రీహాన్ క్లారిటీ ఉన్న కంటెస్టెంట్ అని, కొన్నిసార్లు హర్ట్ చేసేలా మాట్లాడతాడని, బాలాదిత్య మంచితనం తగ్గించుకోవాలంటూ పలు సూచనలు చేశారు సూర్య.
సందడే సందడి..
తమ సినిమా ప్రమోట్ చేసుకుంటూ హౌజ్‌మేట్స్ తో గేమ్ ఆడిపించారు. తమ సినిమా గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు. ఇక అనంతరం ఇంటి సభ్యులతో సాంగ్‌లను గెస్ చేసే గేమ్ పెట్టాడు నాగ్.
శ్రీ సత్య `ఏ` టీమ్, రేవంత్ `బీ` టీమ్ గా నిర్ణయించగా, పీప్ లతో సౌండ్ చేస్తే దాన్ని బట్టి పాటని గెస్ చేసి చెప్పాల్సి ఉంటుంది. టీమ్ ఏ టీమ్ బీ పోటా పోటీగా ఆడగా, చివరకు టీమ్ బీ గెలిచింది. ఇక ఫరియా కోసం ఓ అద్భుతమైన లవ్ సాంగ్ మెప్పించాడు రేవంత్. అది విని తెగ మురిసిపోయింది ఫరియా.
ఇక వారు వెళ్లిపోయిన తర్వాత కూడా గేమ్ ఆడించిన నాగ్.. ఈ వారం నామినేషన్‌లో ఉన్న వారిని సేవ్ చేసే కార్యక్రమం నడిపిస్తూ వచ్చారు.. చివరగా ఆదిరెడ్డి, మెరీనా మిగిలారు. ఆదిరెడ్డి వెళ్లిపోతారని అంతా భావించారు. దీంతో గీతూ వెక్కివెక్కి ఏడ్చింది.
హౌజ్‌లో ఫస్ట్ టైమ్ ఆమె ఏడ్చిందని చెప్పాలి. తాను వెళ్లిపోతే తనని ఎవరు అర్థం చేసుకుంటారని తెగ ఏడ్చింది గీతూ. ఇక ఫైనల్ ఎలిమినేషన్ ప్రక్రియలో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు నాగ్. వారిద్దరిని సేవ్ చేశారు.
దీంతో హౌజ్ మొత్తం ఊపిరి పీల్చుకున్నారు. . నాగార్జునకి, బిగ్ బాస్‌కి వాళ్లు థ్యాంక్స్ చెప్పారు. అయితే వచ్చే వారం ఇంత స్మూత్‌గా ఉండదని హెచ్చరిస్తూ ఈ ఎపిసోడ్‌ని ఫినిష చేశాడు నాగార్జున. మొత్తానికి ఆదివారం ఎపిసోడ్ మాత్రం చాలా రంజుగా సాగింది.
read more news:
Horoscope : 31-10-2022 ఈ రోజు మీ రాశి ఫలాలు తెలుసుకోండి..
Myositis : సమంతకి సోకిన ‘మయోసైటిస్’ వ్యాధి లక్షణాలేంటి ?