Homebigg boss telugu season 6Bigg Boss 6: ఊహించని ఎలిమినేష‌న్.. శ‌నివారం రోజు ఎవ‌రు ఎలిమినేట్ అయ్యారంటే..!

Bigg Boss 6: ఊహించని ఎలిమినేష‌న్.. శ‌నివారం రోజు ఎవ‌రు ఎలిమినేట్ అయ్యారంటే..!

Telugu Flash News

Bigg Boss 6: సీజ‌న్ 6లో ఈ సారి ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తున్నారు బిగ్ బాస్. 21 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్ట‌గా, ఊహించ‌ని కంటెస్టెంట్స్ ఒక్కొక్క‌రిగా ఎలిమినేట్ అవుతూ వ‌స్తున్నారు. పదోవారం మరోసారి పెద్ద‌ షాకిచ్చారు. ఈ శనివారం బాలాదిత్యని ఎలిమినేట్‌ చేశారు.

అంత సేపు డాక్టర్‌, పేషెంట్‌ గేమ్‌ ఆడించిన హోస్ట్ నాగార్జున చివర్లో ఊహించని విధంగా స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా ఉన్న బాలాదిత్యని ఎలిమినేట్ అయ్యాడు అని ప్ర‌క‌టించ‌డంతో అందరు అవాక్క‌య్యారు. అస‌లు ఈ ఎలిమినేష‌న్స్ చూసి లోపల ఉన్న వారి గుండెలు గుబేల్‌మంటున్నాయి. ఎలిమినేషన్స్ ప్రక్రియలో ఏం జరుగుతుందనే ఆందోళన అంద‌రిలో మొద‌లైంది.

ఈ రోజు కూడా ఎలిమినేష‌న్..

బాలాదిత్య ఎలిమినేష‌న్ అత‌నికే పెద్ద షాకిగ్‌గా ఉండ‌గా, అత‌ను మాత్రం తన బాధని దిగమింగుకుని నవ్వులు చిందించడం విశేషం. ఇక స్టేజ్‌పైకి వచ్చిన బాలాదిత్య జర్నీ ఆద్యంతం ఎమోషనల్‌గా సాగింది. అనంత‌రం కంటెస్టెంట్స్ గురించి కొన్ని విష‌యాలు చెప్పుకొచ్చాడు బాలాదిత్య‌. ఆదిరెడ్డి బెస్ట్ పర్సన్ అని, చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడాలని తెలిపారు.

ఫైమా గురించి చెబుతూ, స్ట్రాటజీలు వాడొచ్చని, కాకపోతే అవి ఫెయిరా? అన్‌ ఫెయిరా అనేది కాస్త చూసుకోవాల‌ని తెలిపారు. రాజ్‌ ప్రారంభం నుంచి చాలా ఎదుగుతూ వస్తున్నాడని, గ్రాఫ్‌ బాగుందని, కాకపోతే మాటల్లో క్లారిటీ కొంత మిస్ అవుతుంద‌ని బాలాదిత్య అన్నాడు.

ఇక రోహిత్‌.. బ్యాలెన్స్ తప్పొద్దని, సెటిల్డ్ గా ఆలోచించి మాట్లాడాలని అన్నారు.. మెరీనాని ఇండిపెండెంట్‌గా ఆడమ‌ని కోరాడు. శ్రీ సత్య.. తనకు చెల్లమ్మలాంటిదని, తనకు గోరు ముద్దలు తినిపించిందని చెప్పి ఆమె త‌న మాట తీరు, ఆట తీరు కాస్త మార్చుకోవాలని తెలిపారు. శ్రీహాన్‌ స్మార్ట్ ప్లేయర్‌ అని, ఆలోచించి ఆడాలని, బ్యాలెన్స్ తప్పొదని తెలియ‌జేశాడు.

రేవంత్‌ గురించి చెబుతూ, అతి రౌద్రం అని, అది పక్కన పెడితే చిన్న పిల్లాడు అని, ఆవేశం తగ్గించుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఇనయ.. మాటతీరు, ఆలోచన కాస్త‌ ట్రాక్‌ తప్పుతుందన్నారు. తనకు మాత్రమే తప్పుని తప్పు అని చెప్పే ధైర్యముందని ప్ర‌శంస‌లు కురిపించాడు. కీర్తి ..లోపల డైమండ్ అని, ఇతరుల గురించి ఆలోచించి ఆట ఆడుతుంది. వాసంతి కి కొంచెం చుర‌కులు అంటించాడు. ఓడిపోతే అతిగా బాధ పడిపోతుందన్నారు. ఇక ఈ రోజు వాసంతి ఎలిమిట‌నేట్ కానుంద‌ని తెలుస్తుంది.

-Advertisement-

also read news:

horoscope : 13-11-2022 ఆదివారం రాశి ఫలాలు తెలుసుకోండి..

Viral video : రెచ్చిపోయి వధువుపై కేక్ రుద్దిన వరుడు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజెన్లు

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News