Telugu Flash News

Meiyazhagan | సినిమాను సినిమాలా చూడండి!

Meiyazhagan

Meiyazhagan | తమిళ స్టార్ హీరో సూర్య తన అభిమానులను ఉద్దేశించి ఓ ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. తన సినిమా ‘మెయ్యజగన్’ (తెలుగులో ‘సత్యం సుందరం’) ప్రమోషన్‌లో భాగంగా, సూర్య సినిమాను ఎలా ఎంజాయ్ చేయాలనే దానిపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.సినిమాను ఒక సినిమాలా చూడాలని, బాక్సాఫీస్ కలెక్షన్లు వంటి విషయాలను పక్కన పెట్టి సినిమాలోని కథ, కథనం, నటన, సంగీతం వంటి అంశాలను ఆస్వాదించాలని సూచించారు.

సూర్య తన మాటల్లో, “సినిమాను ఒక అభిమానిగా సెలబ్రేట్ చేసుకోవాలి తప్ప, దానిలోని తప్పొప్పుల గురించి రివ్యూ చేయడంపై దృష్టి పెట్టకండి. అది సినిమాను ఎంజాయ్ చేయనివ్వదు” అని స్పష్టం చేశారు.

సూర్య చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రేమికులు ఈ వ్యాఖ్యలను ఆదరిస్తూ, సూర్య చేసిన సూచనను అనుసరిస్తామని తెలియజేస్తున్నారు.

‘మెయ్యజగన్’ సినిమా సెప్టెంబర్ 28న తెలుగులో ‘సత్యం సుందరం’ పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాను ’96’ వంటి ఫీల్‌ గుడ్‌ మూవీని తెరకెక్కించిన సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు.

తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన ‘సత్యం సుందరం’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఈ అంచనాలను మరింత పెంచింది.

Exit mobile version