HomecinemaPushpa: పుష్ప‌ సామీ సామీ పాట‌కు చిన్నారి డ్యాన్స్.. ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన సూర్య‌

Pushpa: పుష్ప‌ సామీ సామీ పాట‌కు చిన్నారి డ్యాన్స్.. ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన సూర్య‌

Telugu Flash News

Pushpa: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన లేటెస్ట్ హిట్ చిత్రం పుష్ప‌. గ‌త ఏడాది థియేట‌ర్‌లో విడుద‌లై సంచ‌ల‌నం సృష్టించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.

పుష్ప‌రాజ్‌గా బ‌న్నీ చేసిన మ్యాజిక్‌కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయ్యారు. ప‌లు సాంగ్స్ లో ఆయ‌న అద్భుత‌మైన ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ప్ర‌తి సాంగ్‌లోను బ‌న్నీ ఎక్స్‌ప్రెష‌న్స్ అదిరిపోయాయి. అయితే బ‌న్నీ మేన‌రిజంని చిన్నపిల్లాడి నుండి పెద్ద వాళ్ల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రు అనుక‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఫిదా అయ్యాడుగా..!

తాజాగా స్కూల్లో ఓ చిన్నారి సామీ సామీ అంటూ రష్మికలా స్టెప్పులు వేసింది. ఈ వీడియో తెగ చ‌క్క‌ర్లు కొట్ట‌డంతో ఎస్ జే సూర్య కంట్లో పడింది. వెంట‌నే ఆ వీడియోను చూసి, అందులో చిన్నారి వేసిన స్టెప్పులు చూసి పగలబడి న‌వ్వుతూ క్యూట్ కామెంట్స్ పెట్టాడు. ఎంతో క్యూట్‌గా ఉందని ప్రశంసించాడు.

అల్లు అర్జున్ సర్.. రష్మిక అంటూ వారిని ట్యాగ్ చేసి.. న‌వ్వుతున్న ఎమోజీల‌ను జ‌త చేశాడు. ప్ర‌స్తుతం సూర్య షేర్ చేసిన ఈ వీడియో ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సుల‌ని దోచుకుంటుంది.

ఇక పుష్ప విష‌యానికి వ‌స్తే ఈ సినిమాకి దేవి శ్రీ ప్ర‌సాద్ అద్భుత‌మైన సంగీతం అందించాడు. ఈ సినిమా సైమాలోను వీర విహారం చేసింది. బ‌న్నీతో పాటు పలువురికి అవార్డులు ద‌క్కాయి.

రెండో పార్ట్ కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొద‌లు అవుతుందో క్లారిటీ ఇవ్వడం లేదు. 2023లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు.

-Advertisement-

దేవీ శ్రీ ప్రసాద్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయయని, మూడు పాటలకు సంబంధించిన ట్యూన్లు కూడా ఓకే అయ్యాయని ఇటీవ ల వార్త‌లు వ‌చ్చాయి.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News