HomecinemaSuresh Babu:సొంత కొడుకు సినిమా విడుద‌ల చేయ‌లేక‌పోతున్న సురేష్ బాబు.. అస‌లేమైంది...!

Suresh Babu:సొంత కొడుకు సినిమా విడుద‌ల చేయ‌లేక‌పోతున్న సురేష్ బాబు.. అస‌లేమైంది…!

Telugu Flash News

Suresh Babu: టాలీవుడ్ బ‌డా ప్రొడ్యూస‌ర్స్‌లో సురేష్ బాబు ఒకరు. ఆయ‌న పెద్ద కొడుకు రానా ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. రెండవ తనయుడు, దగ్గుపాటి రానా తమ్ముడు దగ్గుపాటి అభిరామ్ ఇటీవ‌లే ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టాడు. ఆయ‌న‌ హీరో గా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం ‘అహింస’. గీతికా తివారి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో సదా, జేడీ చక్రవర్తి , రజిత్ భేడి, కమల్ కామరాజు మరియు బిందు చక్రవర్తి వంటి వారు ముఖ్యపాత్రలు పోషించ‌గా, ఈ చిత్రానికి తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే ఈ సిసినిమాకి బిజినెస్ లేక రిలీజ్ కాలేక‌పోతున్న‌ట్టు తెలుస్తుంది.

సినిమాల్లోని పాటలు మరియు ప్రోమోలు బాగా క్లిక్ అయ్యినప్పటికీ కూడా బయ్యర్స్ ఈ సినిమాని కొనేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు. అస‌లు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7 వ తారీఖున రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కాని ఏవో కార‌ణాల వ‌ల‌న ఏప్రిల్ 22కి వాయిదా వేశారు. ఆ డేట్ కి కూడా సినిమా రాలేదు. ఇప్పుడు ఈ చిత్రాన్ని జూన్ 2 న విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. సురేష్ బాబు లాంటి నిర్మాత నిర్మించిన సినిమాకి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటని కొంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. అయితే ఈ చిత్రాన్ని మంచి ఔట్పుట్ కోసం మాత్రమే వాయిదా ప‌డుతుందే త‌ప్ప మ‌రే ఇత‌ర కార‌ణం కాదు అని యూనిట్ స‌భ్యులు అంటున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News