Homecinemaసురేఖా వాణి కూతురు ఆ యూట్యూబ‌ర్ ప్రేమ‌లో మునిగి తేలుతుందా..!

సురేఖా వాణి కూతురు ఆ యూట్యూబ‌ర్ ప్రేమ‌లో మునిగి తేలుతుందా..!

Telugu Flash News

Surekha Vani: క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స‌త్తా చాటిన సురేఖా వాణి ఇటీవ‌ల తెగ వార్త‌ల‌లో నిలుస్తున్న విష‌యం తెలిసిందే. కూతురితో క‌లిసి ఆమె చేసే హంగామా మాములుగా లేదు. అయితే త్వ‌ర‌లో హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతుంద‌నుకున్న సురేఖా వాణి కూతురు ఇప్పుడు ఓ యూట్యూబ‌ర్‌తో ప్రేమ‌లో ప‌డిన‌ట్టు తెలుస్తుంది.

ముఖ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్రసింహకు ఆమె మనసిచ్చారంటూ కథనాలు వెలువడుతున్నాయి. తరచుగా నిఖిల్-సుప్రీత కలిసి కనిపిస్తూ, చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు.

ఈ క్రమంలోనే వారిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నారనే రూమర్స్ తెరపైకి వచ్చాయి. నిఖిల్ తో సంథింగ్ సంథింగ్ పుకార్లు వినిపిస్తున్నప్పటికీ సన్నిహితంగా ఉండటం మానలేదు. ఇద్దరూ కలిసి రొమాంటిక్ ఫోటో షూట్స్ చేయ‌డం, క‌లిసి తిర‌గ‌డం వంటివి చేస్తున్నారు. దీనిపై సుప్రిత ఏ మాత్రం స్పందించ‌డం లేదు.

ఆ మధ్య తల్లి సురేఖా వాణి రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు రాగా, ఆ స‌మ‌యంలో సుప్రీత ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మ‌రి నిఖిల్ ని ప్రేమిస్తుందంటూ ఇంత పెద్ద చర్చ నడుస్తున్నా… సుప్రీత స్పందించకపోవడం విశేషం.

also read :

Oversleeping : ఎక్కువ నిద్రపోయినా సమస్యలే.. ఈ జబ్బులు సోకే ప్రమాదం!

-Advertisement-

bhumi pednekar hot stills at Sidharth, Kiara Advani reception

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News