Telugu Flash News

Surekha Vani: సురేఖా వాణి స్టెప్పుల‌కి సోష‌ల్ మీడియా షేక్..ఒకే చోట చేరిన లేడి యాక్ట‌ర్స్..!

Surekha Vani: స‌హాయ పాత్ర‌ల‌లో న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన వారిలో సురేఖా వాణి ఒక‌రు. ఒక‌ప్పుడు చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించే సురేఖా వాణి ఇటీవ‌ల మాత్రం త‌న ప‌ద్ధ‌తి మార్చింది. కూతురితో క‌లిసి స్టైలిష్ డ్రెస్ లు ధ‌రించి తెగ డ్యాన్స్‌లు చేస్తూ నానా ర‌చ్చ చేస్తుంది.

సోష‌ల్ మీడియాలొ చాలా యాక్టివ్‌గా ఉంటూ నిత్యం త‌న అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తూ వ‌స్తుంది సురేఖా వాణి. అయితే సురేఖా వాణి తాజాగా త‌న తోటి న‌టీమ‌ణుల‌తో క‌లిసి తెగ సంద‌డి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

ఇక ఈ లేడీ యాక్టర్స్ అందరూ కూడా సురేఖావాణి ఇంట్లోనే కలిసినట్లు తెలుస్తోంది. జస్ట్ కలవడమే కాదన్నట్లు.. ‘రా రా రక్కమ్మ’ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు కూడా వేసి అల‌రించారు. ఈ వీడియోని స్వయంగా సురేఖావాణినే తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

ఇక ఈ ఫొటోలు, వీడియోలు చూసిన నెటిజన్స్… కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ‘అందరూ ఉన్నారు కానీ ప్రగతి, పవిత్రా లోకేష్ మిస్ అయ్యారు’ ఎక్క‌డికి వెళ్లారు అని మ‌రి కొంద‌రు త‌మ కామెంట్స్ లో తెలియ‌జేస్తున్నారు. ప్ర‌స్తుతం సురేఖా వాణి పోస్ట్ చేసిన వీడియో ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

Exit mobile version