Telugu Flash News

“EWS రిజర్వేషన్ చట్టబద్దమే”- సుప్రీమ్ కోర్టు ! EWS కోటా రిజర్వేషన్ కి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేయాలి?

EWS QUOTA CASE

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్ర ,ప్రభుత్వ ఉద్యోగాలలో 10 % రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర మంత్రి మండలి రాజ్యాంగ సవరణలకు చేస్తూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు EWS కోటను తీసుకువచ్చింది. అయితే EWS కోటను తీసుకురావడంతో రిజర్వేషన్ 50 శాతము దాటిందని రాజ్యాంగం నిబంధనలకు విరుద్ధమని EWS కోటను రద్దు చేయాలని ధాఖలైన పిటిషన్ పై 5 గురు న్యాయ మూర్తులతో కూడిన బెంచ్ నేడు విచారణ జరిపింది . అందులో నలుగురు న్యాయమూర్తులు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు EWS కోట రాజ్యాంగ బద్దమని తీర్పును వెల్లడించారు .

EWS సర్టిఫికేట్ – EWS కోటా రిజర్వేషన్ కి ఎవరు అర్హులు?

ఈ కొత్త కేటగిరీ కింద రిజర్వేషన్లు క్లెయిమ్ చేసుకునేందుకు అభ్యర్థులకు ప్రభుత్వం కొన్ని అర్హత షరతులను విధించింది. EWS పూర్తి గ ఆర్థికముగ బలహీన వర్గాలవారికి ఉపయోగపడే కోట .

సర్టిఫికేట్‌కు అర్హత పొందడానికి, మీరు క్రింద పేర్కొన్న అన్ని షరతులను సంతృప్తి పరచాలి:

మీరు ‘జనరల్’ అభ్యర్ధి అయి ఉండాలి (SC, ST లేదా OBCలకు రిజర్వేషన్ కింద మీరు ఉన్నట్లయితే అనర్హులు )

అన్ని మార్గాలనుంచి మీ కుటుంబ స్థూల వార్షిక ఆదాయం రూ. .8 లక్షలు లోపు ఉండాలి.

మీ కుటుంబం 5 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూమిని కలిగి ఉండకూడదు.

1000 చదరపు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో నివాస గృహాన్ని కలిగి ఉండకూడదు.

మీ కుటుంబం 100 చదరపు గజాలు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో (నోటిఫైడ్ మునిసిపాలిటీలలో) నివాస స్థలాన్ని కలిగి ఉండకూడదు.

200 చదరపు గజాలు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో (నోటిఫైడ్ మునిసిపాలిటీలలో కాకుండా) నివాస స్థలాన్ని కలిగి ఉండకూడదు.

EWS రిజర్వేషన్‌ల కోసం నేను ఎలా దరఖాస్తు చేయాలి?

మీరు మీ స్థానిక ప్రభుత్వ అధికారం (మండలం ) నుండి EWS సర్టిఫికేట్ పొందవచ్చు. సర్టిఫికేట్‌ను ‘ఆదాయం మరియు ఆస్తుల సర్టిఫికేట్’ అని పిలుస్తారు.

EWS సర్టిఫికేట్ పొందడానికి ప్రభుత్వం సూచించిన ఆన్‌లైన్ పద్ధతి లేదు. మీరు మీ స్థానిక తహసీల్ లేదా ఏదైనా ఇతర స్థానిక ప్రభుత్వ అధికారానికి వెళ్లాలి.

అవసరమైన ధ్రువపత్రాలు :

1. ఆదాయం ధ్రువపత్రం
2.ఆధార్ కార్డ్
3. పాన్ కార్డ్
4. బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు
5.పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మొదలైన అదనపు పత్రాలు అవసరం .

ఎవరు ద్రువీకరిస్తారు :

నియమించబడిన ప్రభుత్వ అధికారి మీ పత్రాలను ధృవీకరిస్తారు మరియు మీ EWS ప్రమాణపత్రాన్ని జారీ చేస్తారు.
జిల్లా మేజిస్ట్రేట్,అదనపు జిల్లా మేజిస్ట్రేట్,కలెక్టర్/డిప్యూటీ కమిషనర్, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ లేదా మండల ఉన్నతాధికారులు దీనిని ద్రువీకరిస్తారు.

also read:

chandra grahan 2022 : చంద్ర గ్రహణం గర్భిణిలపై ప్రభావం చూపుతుందా ? తిరుపతి ఆలయం 11 గంటల పాటు మూసివేత !

యాలకులు తినడం వల్ల మీ శరీరానికి ఏం జరుగుతుందో… తెలుసా !

Exit mobile version