IND vs PAK: ఆదివారం రోజు క్రికెట్ అభిమానులకి పైసా వసూల్ మ్యాచ్ దొరికింది. అసలు పాక్- ఇండియా మ్యాచ్ అంటేనే ఫుల్ మజా ఉంటుంది.అలాంటిది ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి చివరి బంతికి ఇండియాని గెలిపించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. ఉత్కంఠగా సాగిన పోరులో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఛేదనలో మొనగాడిగా మరోసారి నిరూపించాడు కోహ్లీ. చివరి ఓవర్లో 16 పరుగులు కావాల్సి ఉండగా బంతి బంతికి ఉత్కంఠ మధ్య సాగిన ఓవర్లో భారత్ నే విజయం వరించింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ.. 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఆనందం తట్టుకోలేక..
ఈ విజయంతో భారత్.. గతేడాది పాకిస్తాన్ చేతిలో ఎదురైన పరాజయానికి భారత్ బదులు తీర్చుకుంది. అయితే ఈ మ్యాచ్‌ని టీవీలో చూసే వారే కాకుండా గ్రౌండ్ నుండి వీక్షిస్తున్న వారు ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా సునీల్ గవాస్కర్ (sunil gavaskar) అయితే మ్యాచ్ గెలిచిన వెంటనే చిన్న పిల్లాడిలా ఎగురుతూ తెగ సంబరపడిపోయాడు.
The celebration by Sunil Gavaskar is gold. pic.twitter.com/5RkFtEJ1nx
— Johns. (@CricCrazyJohns) October 23, 2022
ఆయనతో పాటు ఇర్ఫాన్ ఫఠాన్, మాజీ ఆటగాళ్లు ఫుల్ ఖుష్ అయ్యారు. ఇందుకు సంబంధిచిన వీడియో వైరల్‌గా మారింది ఈ మ్యాచ్‌లో 160 పరుగుల లక్ష్యఛదనలో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది . అసలు గెలవడం చాలా కష్టం అనుకున్నారు.
మెయిన్ బ్యాట్స్ మెన్స్ … 8 బంతుల్లో 4 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, నసీం షా బౌలింగ్‌లో అవుట్ కాగా 7 బంతుల్లో 4 పరుగులు చేసిన రోహిత్ శర్మ, హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 10 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ కూడా హారీస్ రౌఫ్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.
బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన అక్షర్ పటేల్ 3 బంతుల్లో 2 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఆ సమయంలో కోహ్లీ (virat kohli) వన్ మ్యాన్ షో చూపించి గెలిపించాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చూడండి :
రాత్రిపూట తలస్నానం చేస్తే..నష్టమా ? లాభమా ?
ఉసిరికాయ వలన కలిగే అద్బుత ఆరోగ్య ప్రయోజనాలు