Sudigali Sudheer: మల్టీ టాలెంటెడ్ అయిన సుడిగాలి సుధీర్ ఇటు బుల్లితెర, అటు వెండితెరపై తెగ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. జబర్ధస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకి తాత్కాలిక బ్రేక్ ఇచ్చిన సుధీర్ ఇప్పుడు సినిమాలతో బిజీ అయ్యాడు.
సుధీర్ నటించిన ‘గాలోడు’ మూవీ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాగా, రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బి, సి సెంటర్లలో పాజిటివ్ టాక్‌తో రన్ అవుతోంది.
ఈ మూవీ కోసం దాదాపు ఆరు నెలలు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీకి దూరంగా ఉన్న సుధీర్.. రూ.50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
ఇక గాలోడు చిత్రం మంచి విజయం సాధించడంతో ఈ మూవీకి సంబంధించిన విశేషాలను సుధీర్ మీడియాతో పంచుకున్నాడు.
‘గాలోడు’ సినిమాలోని ‘నీ కళ్లే దీవాలి’ పాట షూటింగ్ కోసం లద్దాఖ్ వెళ్లామని చెప్పాన సుధీర్… భూమి కంటే 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న పాంగ్యాంగ్ లేక్ దగ్గర షూట్ చేశామని అన్నాడు.
అయితే అక్కడ చాలా చల్లగా ఉంటుందని తెలిసి ఆక్సిజన్ సిలిండర్స్ కూడా తీసుకెళ్లాం. అక్కడి పరిస్థితుల వలన మూవీ టీంలో కొందరు బ్రీతింగ్ విషయంలో ఇబ్బందిగా అనిపించడంతో పూర్తిగా పైవరకు రాలేకపోయారని అని అన్నాడు.
హీరోయిన్ తల్లికూడా అలానే సగం ఎత్తుకు వెళ్లగానే ఇబ్బంది పడ్డారని , అయితే కూతురి కోసం రిస్క్ చేసి అలానే వచ్చారని సుధీర్ చెప్పుకొచ్చాడు.
అసలు ఉదయం లేవగానే వెళ్లిపోవాలని అనుకున్నాం కానీ నిర్మాత డబ్బులు వృథా చేయడం ఇష్టం లేక కష్టంతోనే షూటింగ్ కంప్లీట్ చేశామని చెప్పాడు.
అయితే అక్కడ మైనస్ 20, 30 డిగ్రీల చల్లగా ఉంటుందని, ఊపిరి పీల్చుతున్నా సరే మంచు లోపలికి వెళ్లిపోతుందని, అడుగు తీసి అడుగు వేయాలంటే చాలా ఇబ్బందిగా ఉండేదని సుధీర్ అన్నాడు.
ఇక డ్యాన్స్ చేస్తున్నప్పుడు ప్రతి షాట్ తర్వాత తన ముక్కు నుంచి రక్తం కారేదని.. దాన్ని తుడుచుకుని షూటింగ్ పూర్తి చేశానంటూ షూటింగ్ పరిస్థితుల గురించి వివరించాడు. ఇది విన్న అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
also read news:
బిస్లరీ యజమాని తన కంపెనీని ముఖేష్ అంబానీకి బదులుగా టాటాకు ఎందుకు విక్రయిస్తున్నాడు?
ఆకాశంలో అద్భుతం.. ఈ ‘అరోరా బొరియాలిస్’ వెరీవెరీ స్పెషల్.. ఎందుకంటే..!?