Telugu Flash News

Bigg Boss 6 Telugu : ఊహించిందే జ‌రిగింది.. బిగ్ బాస్ నుండి ఈ వారం ఎలిమినేట్ అయ్యారంటే..!

bigg boss telugu season 6

Bigg Boss 6 Telugu : 21 మంది కంటెస్టెంట్స్‌తో మొద‌లైన బిగ్ బాస్ సీజ‌న్ 6 స‌క్సెస్ ఫుల్‌గా ఆరు వారాలు పూర్తి చేసుకుంది. నిన్న ఆదివారం కావ‌డంతో ఏ కంటెస్టెంట్‌ని బ‌య‌ట‌కు పంపిస్తారా అనే టెన్ష‌న్ అంద‌రిలో ఉంది. అయితే ఊహించిన‌ట్టుగానే బాల న‌టిగా ప‌రిచ‌య‌మైన సుదీప బిగ్ బాస్ హౌజ్ వీడింది. ఈ వారానికి తొమ్మిది మంది నామినేట్ కాగా, వారిలలో ఆదిరెడ్డి, గీతూ, బాల ఆదిత్య, సుదీప, శ్రీహాన్, కీర్తి, శ్రీసత్య, రాజశేఖర్, మెరీనా ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వ‌చ్చిన నాగార్జున చివర్లో గీతూ, బాల ఆదిత్య, సుదీపల‌ని ఉంచారు.

సుదీప ఔట్..

ఇసుక నింపిన కుండీలు ఆ ముగ్గురి ముందుంచిన నాగార్జున పేరు చెప్పినప్పుడు ఇసుక లోపల ఉన్న బిళ్ళను తీయాలి అని చెప్పారు. ముందుగా బాల ఆదిత్య పేరు పిలవగా ఆయన బిళ్ళ తీయ‌గా, అన్ సేఫ్ అని రాసుంది. తర్వాత గీతూ తీయడంతో సేఫ్ అని రాసున్న బిళ్ళ రాగా, ఫుల్ ఖుషీ అయింది. అనంతరం సుదీప కుండీలో ఉన్న బిళ్ళపై కూడా అన్ సేఫ్ అని రాసుండ‌డంతో చివ‌రిలో బాల ఆదిత్య, సుదీపలో ఎవరు ఎలిమినేట్ అవుతారని అంద‌రు చాలా టెన్ష‌న్‌తో ఎదురు చూసారు. ఆ స‌మ‌యంలో స్టోర్ రూమ్ లో ఉన్న రెండు బ్యాటరీలు తెప్పించిన నాగార్జున బ్యాటరీలకు ఉన్న వైట్ పార్ట్స్ కి రెండు క్లిప్స్ తగిలించి, స్క్రీన్ పై మీ బ్యాటరీ చార్జెస్ కనిపిస్తాయి ఎవ‌రికైతే తక్కువ రీఛార్జ్ ఉంటుందో వారు ఎలిమినేటైనట్లని అన్నారు.

sudeep eliminated from bigg boss telugu 6

నాగార్జున చేప‌ట్టిన ఈ ప్రక్రియలో సుదీప్ బ్యాటరీ జీరో ఛార్జ్ తో రెడ్ చూపించ‌గా, బాల ఆదిత్య బ్యాటరీ ఛార్జింగ్ తో గ్రీన్ మార్క్ చూపించింది. దాంతో సుదీప ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించి, ఆమెను స్టేజ్ మీద‌కు రావాల‌ని అన్నారు. అయితే సుదీప్ ఎలిమినేష‌న్‌తో మెరీనా, బాలాదిత్య చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు. ఇక స్టేజ్ మీద‌కు వ‌చ్చిన సుదీప‌… నా భర్త రంగనాథ్ రెండు వారాల కంటే ఎక్కువ ఉండవన్నారు. కానీ నేను ఆరు వారాలు ఉండి చూపించాన‌ని సుదీప అంది. ఇంటి స‌భ్యుల‌ని కూర‌గాయ‌ల‌తో పోలుస్తూ కాసేపు గేమ్ ఆడి వెళ్లిపోయింది.

Exit mobile version