Homecinema'కాంతారా' (kantara) లో ఉన్న గ్రామ పెద్ద ఇల్లు ఎక్కడుందో తెలుసా..మీరు కూడా ఆ ఇంటిలో ఉండచ్చు..

‘కాంతారా’ (kantara) లో ఉన్న గ్రామ పెద్ద ఇల్లు ఎక్కడుందో తెలుసా..మీరు కూడా ఆ ఇంటిలో ఉండచ్చు..

Telugu Flash News

‘కాంతారా’ (kantara)  సినిమా కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న థియేటర్లలో రిలీజ్ అయిన దగ్గరనుండి ఎక్కడ చూసినా ఆ సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి. ఆ సినిమాకు వచ్చిన విశేషాదారణ చూసి మిగిలిన భాషల్లో కూడా ఆ సినిమాను రిలీజ్ చేశారు.

సోషల్ మీడియా లో ‘కాంతారా’ హిందీ వెర్షన్, తెలుగు వెర్షన్ సినిమా గురించిన చర్చలు ట్రేండింగ్ లో దూసుకెళ్తున్నాయి. ఈ సినిమాకు దర్శకత్వం మరియు రచన రిషబ్ శెట్టి (rishab shetty) అయితే నిర్మించింది విజయ్ కిరగందుర్.

ఇక్కడ ప్రధానంగా ‘కాంతారా’ లో చూపించిన కంబ్లా మరియు భూత కోలా సంప్రదాయం అనేక చర్చలకు దారితీసింది. అందరూ ఆ తెగల గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా దక్షిణ కర్ణాటకలోని ఒక ప్రాంతంలో ఒక గ్రామంలో  సెట్ వేసి షూటింగ్ అక్కడ జరిపారు.

kantaraగ్రామపెద్ద ఇల్లు అయిన ‘ధనిగల మనే’ (మనే అంటే ఇల్లు) ఈ సినిమాలో ముఖ్య భూమిక పోషించింది. ఆ గ్రామపెద్ద తన ఇంటిలో భోజనానికి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నప్పుడు శివ అతనికి కనపడే సీన్ ఆ ఇంటిలోనే తీశారు.

కాంతారా లో ఉన్న గ్రామ పెద్ద ఇల్లు ఒక రిసార్ట్ అని మీకు తెలుసా ?

ఈ ఇల్లు కర్ణాటకలోని ఉడిపి ప్రాంతంలో ఉంది. ఇక్కడ మీరు కూడా బస చేయచ్చు. ఈ ఇల్లు సుమారు 50 ఏళ్ల నాటిది ఈమధ్యనే రిసార్ట్ క్రింద మార్చారు. ఆ ఇంటి నిర్మాణం, ఫర్నిచర్ ఇంకా కళాకృతులు తులునాడు సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.

ఆ ఇంటి ఇంటీరియర్ అంతా రెండువందల ఏళ్ల నాటివి పునర్నిర్మాణం చేశారు. అక్కడ లివింగ్ రూమ్ ఇంకా గదులు వందల ఏళ్ల చరిత్రను సృష్టంగా మనకు తెలియజేస్తాయి.

-Advertisement-

ఈ ఇల్లు బీచ్ కు దగ్గరగా ఉండటమే కాదు ఇంటి చుట్టూ మంచి గార్డెన్ కూడా ఉంది. ఈ ఇంటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింది వీడియో చూడండి

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News