Telugu Flash News

chocolates : చాక్లెట్లు తిని విద్యార్థుల వింత ప్రవర్తన.. గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు చేసిన హెడ్‌మాస్టర్‌ నాయక్‌

chocolates

Telugu Flash News, Hyderabad : రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో విద్యార్థులు వింతగా ప్రవర్తించటంతో హెడ్‌మాస్టర్‌ అంగూర్‌ నాయక్‌ అనుమానం వచ్చింది. వాళ్లను పర్యవేక్షించగా, ఒక కిరాణా షాపులో మత్తు చాక్లెట్లను కొనుగోలు చేసి తింటున్నారని తెలిసింది.

హెడ్‌మాస్టర్‌ ఈ విషయాన్ని జిల్లా విద్యాధికారికి తెలియజేశారు. ఆయన శంషాబాద్‌ జోన్‌ డీసీపీ నారాయణరెడ్డికి సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేస్తే, ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చి కొత్తూరులో విక్రయిస్తున్నట్లు తేలింది.

పోలీసులు కిరాణా షాపుల్లో తనిఖీలు చేపట్టగా 8 కిలోల మత్తు చాక్లెట్లు లభించాయి. ఒడిశాకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

విద్యార్థులు ఒక చాక్లెట్‌ను నలుగురు షేర్‌ చేసుకుని తింటారని, దీంతో కనీసం 12 గంటలపాటు మత్తులో జోగుతున్నట్టు తేలింది.

హెడ్‌మాస్టర్‌ అంగూర్‌ నాయక్‌ ఈ విషయాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించడంతో విద్యార్థుల ప్రాణాలను కాపాడగలిగాడు.

Exit mobile version