HomecinemaVishal : విశాల్ ఇంటిపై రాళ్ల దాడి చేసింది ఎవ‌రు.. అస‌లు ఏం జ‌రిగింది?

Vishal : విశాల్ ఇంటిపై రాళ్ల దాడి చేసింది ఎవ‌రు.. అస‌లు ఏం జ‌రిగింది?

Telugu Flash News

Vishal : త‌మిళ హీరో విశాల్ తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా సుప‌రిచితం. ఆయ‌న ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మ‌రో వైపు ఏదో ఒక విష‌యంతో హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉంటారు.

అయితే తాజాగా నటుడు, నిర్మాత విశాల్ ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. అయితే ఈ విష‌యంపై విశాల్ మేనేజర్ హరి కృష్ణన్ అన్నానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

తెలిసిన వారే..

విశాల్ తన కుటుంబంతో కలిసి చెన్నైలోని అన్నానగర్‌లో నివసిస్తున్నాడు. సోమవారం రాత్రి ఎరుపు రంగు కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు విశాల్ ఇంటిపై రాళ్లతో దాడి చేసి అక్క‌డ నుండి ప‌రార‌య్యారు. రాళ్ల దాడిలో విశాల్ ఇంటి అద్దాల‌న్నీ ధ్వంసం అయ్యాయి. లైటింగ్ సిస్టమ్ కూడా దెబ్బ తిన్నట్టు సమాచారం.

అయితే దుండగులు దాడి చేసిన విజువల్స్ సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ కావ‌డంతో వాటిని విశాల్ మేనేజర్ పోలీసులకు అందించారు. వీరి కంప్లైంట్‌‌ను తీసుకొని పోలీసులు కేసు దర్యాప్తు చేసే పనిలో పడ్డారు.

దాడి జరిగిన సమయంలో విశాల్ ఇంట్లో లేక‌పోవ‌డంతో అంద‌రు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నడిగర సంఘం జనరల్ సెక్రటరీగా ఉన్న విశాల్‌కి గిట్ట‌ని వారే ఈ పని చేసి ఉంటార‌ని భావిస్తున్నారు.

నటుడు విశాల్ ప్రస్తుతం లాఠీ, తుపరివాలన్-2, మార్క్ ఆంటోని చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. లాఠీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అతి త్వ‌ర‌లోనే చిత్రం విడుద‌ల‌కి ప్లాన్ చేస్తున్నారు. విశాల్ గత చిత్రాలైన వీరమే వాగై సూదుం, శత్రువు, చక్రం, యాక్షన్ వంటి చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవ‌డంతో లాఠీ చిత్రంపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నాడు.

-Advertisement-

ఇవి కూడా చదవండి :

Bigg Boss telugu 6: గ‌బ్బుగా మారుతున్న బిగ్ బాస్ హౌజ్..మ‌సాజ్‌లు ఏంది, తినిపించుకోవ‌డాలు ఏంది?

Nikhil Siddhartha : చిరంజీవి, నాగార్జున‌తోనే పోటీకి దిగిన నిఖిల్.. ఇంత డేర్ చేస్తున్నాడా..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News