ఇటీవల సీనియర్ హీరోలకి కాలం కలిసి రావడం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన స్టార్స్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద తేలిపోతున్నారు. వారి సినిమాలు ఫ్లాపులు బాట పడుతున్నాయి. ఇటీవల చిరంజీవి, నాగార్జున, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ ఇలా పలువురు హీరోల సినిమాలు నిరాశపరుస్తున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో అమీర్ ఖాన్ కూడా ఉండడంతో ఆయన తాజాగా అందరు ఆశ్చర్యపోయే నిర్ణయం తీసుకున్నారు.
బాలీవుడ్ లో ఆధిపత్యం ఖాన్ త్రయందే అని చెప్పాలి.. అమితాబ్ తర్వాత షారుక్, సల్మాన్, అమీర్ హిందీ చిత్ర పరిశ్రమను శాసించారు. ఒకరికి మించి మరొకరు ఇండస్ట్రీకి మంచి మంచి హిట్స్ అందించారు. కాకపోతే అదంతా గతం. కొన్నాళ్లుగా వీరికి బ్యాడ్ టైం నడుస్తుందనే చెప్పాలి. షారుక్ అయితే హిట్ కొట్టి దాదాపు పదేళ్లు కావస్తుంది.
సంచలన నిర్ణయం..
2013లో విడుదలైన చెన్నై ఎక్స్ ప్రెస్ తర్వాత షారుక్ ఖాన్ మళ్లీ సక్సెస్ రుచి చూడలేదు. సల్మాన్ పరిస్థితి కూడాదాదాపు అంతే .భజరంగీ భాయ్ జాన్ రేంజ్ హిట్ మళ్ళీ రాకపోగా, ఆయన గత రెండు చిత్రాలు దబాంగ్ 3, రాధే ఘోర పరాజయం పొందాయి. ఇక ప్రయోగాలకి మారుపేరుగా నిలిచిన అమీర్ ఖాన్ కి సైతం హిట్ అనేది కరువైంది. ఇటీవల వచ్చిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చడ్డా దారుణమైన పరాజయం చెందాయి.
ఈ క్రమంలో కొద్ది రోజులు సినిమాల నుంచి విరామం తీసుకోవాలని అనుకుంటున్నానని అమీర్ ప్రకటించారు. తాను నటించడం మొదలు పెట్టి 30 సంవత్సరాలు అయిందని.. ఇన్నేళ్లలో ఏదో నష్టపోయానని తన మనసుకు అనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ఏడాదిన్నర పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. తన ఫ్యామిలీతో గడపాలనుకుంటున్నట్టు అమీర్ స్పష్టం చేశారు.
అమీర్ ఖాన్ ప్రస్తుతం ఛాంపియన్స్ అనే చిత్రం చేస్తుండగా, ఈ సినిమాకు తాను హీరోను మాత్రమే కాదు.. నిర్మాతను కూడా అని ఆయన అన్నారు. అయితే ఛాంపియన్ మూవీ నుండి తాను తప్పుకొని తన స్థానంలో మరొక హీరోని తీసుకు రాబోతున్నట్టు తెలియజేశాడు మిస్టర్ పర్ఫెక్ట్. కాగా గత ఏడాది అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావ్ కి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.
also read news:
Bigg Boss 6: నా గేమ్‌ని తొక్కేస్తున్నారంటూ ఫైమా అసహనం.. భలే మెలిక పెట్టేశారే…!