Sanatana Dharma : సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై హిందూ సంఘాలు మండిపడుతుండగా.. రాజకీయ పార్టీలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి. ఉదయనిధి వ్యాఖ్యలు రాష్ట్రంతో పాటు దేశంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. తమిళనాడులో హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి.
గతంలో ఉదయనిధి చర్చిలు, దేవాలయాలకు వెళ్లిన చిత్రాలతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఉదయనిధిపై క్రిమినల్ కేసు పెట్టాలని బీజేపీ నేతలు తమిళనాడు గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. స్టాలిన్ వ్యాఖ్యల వీడియో ఫుటేజీని గవర్నర్‌కు అందజేశారు.
ఉదయనిధి వ్యాఖ్యలపై తాజాగా ఆయన తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. తన కుమారుడి వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉదయనిధికి మద్దతుగా మాట్లాడారు. తన కుమారుడి వ్యాఖ్యల్లో ఒక్క తప్పు కూడా లేదని తేల్చి చెప్పారు.
దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉండడంలో అర్థమేంటని ప్రశ్నించారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.
బిజెపి ఎన్నికల హామీలను నెరవేర్చలేదన్నారు. బీజేపీ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మతాన్ని ఆయుధంగా వాడుకుంటోందని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టి నిప్పుల వేడిలో చల్లార్చుకోవాలన్నారు.
గుజరాత్ అల్లర్లు, మణిపూర్‌లో హింసాత్మక ఆందోళనలు, హర్యానాలో ఘర్షణలను ప్రస్తావిస్తూ.. బీజేపీని అడ్డుకోకపోతే దేశాన్ని, దేశ ప్రజలను ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు.
మరోవైపు సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ విషయంపై స్పందించి మంత్రి ఉదయనిధికి మద్దతు తెలిపారు. ఈ వివాదంపై ఓ ట్వీట్ చేశారు. అందులో సనాతన పార్లమెంట్ భవితవ్యం ఇలాగే ఉంటుందా అంటూ స్వామిజీతో మోదీ దిగిన ఫొటోను షేర్ చేశారు.
Back to the Future ..a #Tanathani parliament.. dear CITIZENS are you okay with this… #justasking pic.twitter.com/N57FU1Q5gi
— Prakash Raj (@prakashraaj) September 4, 2023