శ్రీలంక (Sri Lanka) ఆర్ధిక వ్యవస్థపై స్పందించిన ఆ దేశ అద్యక్షుడు రణిల్ విక్రమసింఘే. శ్రీలంక ఆర్ధిక వ్యవస్త అస్తవ్యస్తంగా ఉందని,ఆర్ధిక సంక్షోభంతో ప్రజలు నానాతిప్పలు పడుతున్నారన్న విషయం అందరికీ తెలిసిన విషయమే.
అయితే ఇటీవల ఈ విషయంపై శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఒక సమావేశంలో మాట్లాడారు. శ్రీలంక ఆర్ధిక వ్యవస్థను సరిదిద్దడానికి తమ ముందున్న పరిష్కారం గురించి మాట్లాడారు.
ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడాలంటే తమ ముందు ప్రపంచ రుణదాత, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ మద్దతు పొందడం ఒక్కటే మార్గమని రణిల్ విక్రమసింఘే వ్యాఖ్యలు చేశారు.
“దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్న విషయం తనకు తెలుసు.అలాగే దేశం ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉందో కూడా తెలుసు. ఎంతోమంది ఉపాధి కోల్పోయారు,వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.దీంతో జీవనవ్యయం భారంగా మారి, ప్రజల జీవనస్థితిగతుల్లో మార్పులొస్తున్నాయి” అంటూ శ్రీలంక ప్రజలు పడుతున్న ఆర్ధిక తిప్పలు గురించి చెప్పుకొచ్చారు.
ఆర్థిక సంక్షోభం వల్ల విద్య,ఆరోగ్య రంగాలను ప్రభావితం అయ్యాయని.. తద్వారా ప్రజలు ఇంతకుముందు అనుభవించిన సౌకర్యాలను పొందలేకపోతున్నారని రణిల్ పేర్కొన్నారు.ఈ సమస్యలు ఎలా వచ్చాయి?దీన్ని ఎలా సరిదిద్దాలి? అని చర్చించుకోవడం వ్యర్థమని, జరగాల్సిన నష్టం అంతా ఎప్పుడో జరిగిపోయిందని అన్నారు.
ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితితుల్లో ఐఎంఎఫ్ సాయం పొందడం ఒక్కటే మార్గమని,లేకపోతే ఎన్నటికీ కోలుకోలేం అని చెప్పారు. ప్రస్తుతం తాము రుణ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.
ఈ విషయం గురించి ఇప్పటికే జపాన్ తో చర్చలు జరిపామని తెలిపారు. శ్రీలంక చైనా, జపాన్, భారత్ దేశాల నుంచి రుణ సాయం పొందిందని అన్నారు. అమెరికా,యూరప్ లో ఆర్థిక వృద్ధి మందగిస్తోందని.. దాని వల్ల వచ్చే ఏడాది శ్రీలంక ఎగుమతి మార్కెట్ పడిపోయే అవకాశం ఉందని అంచనా వేశారు. అలా జరగకుండా ఉండాలంటే పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్నారు.
2024 కల్లా మెరుగైన వృద్ధి సాధించగలమని, ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేట్ రంగాన్ని కూడా బలోపేతం చేయాలని అన్న రణిల్ ఈ ఏడాది తొలి త్రైమాసిక తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో అభివృద్ధి కార్యక్రమాలని కొనసాగించాలన్నారు. ఫలితంగా ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు. ఈ సమావేశంలో ప్రతినిధులతో ప్రభుత్వం, ప్రైవేటు కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులతో దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనడం లాంటి చర్యలపై రణిల్ విక్రమసింఘే చర్చించారు.
also read:
నేనూ ప్రవాస భారతీయుడినే.. స్విట్జర్లాండ్లో మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Kodi Pandalu : ఏపీలో విచ్చలవిడిగా కోడి పందాలు.. ఎన్నికోట్లు చేతులు మారాయంటే..!