HomecinemaSrikanth: నేను చ‌నిపోయిన‌ట్టు రాసారు.. ఎంత‌గా బాధ ప‌డ్డామో తెలుసా.. శ్రీకాంత్ ఫైర్

Srikanth: నేను చ‌నిపోయిన‌ట్టు రాసారు.. ఎంత‌గా బాధ ప‌డ్డామో తెలుసా.. శ్రీకాంత్ ఫైర్

Telugu Flash News

Srikanth: ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తూ అల‌రిస్తున్నాడు. ఆయ‌న కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటారు. అటువంటి శ్రీకాంత్ పై లాస్ట్ ఇయర్ నవంబర్ లో తప్పుడు ప్ర‌చారాలు చేశారు. ఆయ‌న త‌న భార్య ఊహ‌కి విడాకులు ఇచ్చాడ‌ని క‌థ‌నాలు అల్లారు. దీనిపై స్పందించిన శ్రీకాంత్ అవ‌న్నీ అస‌త్య ప్ర‌చారాలు అని అన్నారు. ఇక తాజాగా దీనిపై స్పందించిన శ్రీకాంత్‌.. మా మీద త‌ప్పుడు వార్త‌లు రాస్తుండ‌డం వ‌ల‌న నాభార్య ఊహాను వెంట పెట్టుకుని పార్టీలు..ఫంక్షన్స్ కు వెళ్లాల్సి వ‌స్తుంది.

అస‌లు ఊహ‌కి సినిమా ఫంక్షన్స్ అన్నా… పార్టీలు అన్నా ఇష్టం ఉండదు. కాని బ్రతిమలాడి ఆమెని తీసుకెళ్ళాల్సి వస్తుంది. ఎవరికి నచ్చినట్టు వారు రాస్తున్నారు కాని.. మా బాధను అర్ధం ఒక్క‌రు కూడా చేసుకోవడంలేదు. రీసెంట్ గా నా ఫోటో పెట్టి నేను చనిపోయినట్టు రాయ‌డం జ‌రిగింది. అది చూసి మేము తట్టుకోగలం..కాని అమ్మవాళ్లు చూస్తే.. ఏం జ‌రుగుతుంద‌నేది ఆలోచించ‌రా.. వీళ్లు వారంత‌ట వారు త‌ప్ప‌క మారాలి అని శ్రీకాంత్ స్ప‌ష్టం చేశారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News