Homecinemaకళ్యాణ్ దేవ్‌కు మెగా ఇంట్లో అవమానం? అందుకే విడిపోయాడా?

కళ్యాణ్ దేవ్‌కు మెగా ఇంట్లో అవమానం? అందుకే విడిపోయాడా?

Telugu Flash News

Sreeja Kalyan Dev divorce news : మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ రెండో భర్త కల్యాణ్‌ దేవ్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌. ఆయ‌న అప్పుడప్పుడు సోష‌ల్ మీడియాలో చేసే కామెంట్స్ ఎన్నో అనుమానాల‌కి తావిస్తూ ఉంటుంది.
శ్రీజతో క‌ళ్యాణ్ దేవ్ డివోర్స్ తీసుకున్నాడంటూ కొన్నాళ్లుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఎందుకు ఇలా జ‌రిగిందో ఎవ‌రికి క్లారిటీ అయితే రాలేదు. ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చి వీరి వ్యవహారం ఇంత వరకు వచ్చిందనేది తెలియలేదు. విడాకులు తీసుకునేంతగా ఏమై ఉంటుందంటూ సోషల్ మీడియా జనం డిస్కషన్స్ పెట్టేసారు.

తాజాగా కళ్యాణ్‌ దేవ్ వేసిన పోస్ట్ చూస్తుంటే.. పరోక్షంగా తాను ఎందుకు దూరంగా ఉంటున్నాడో చెప్పకనే చెప్పినట్టుగా అనిపిస్తుందంటున్నారు. తన పోస్ట్‌లో .. ఎదుటి వాళ్లు మనల్ని ఎంతగా లైక్ చేస్తున్నారనేది ముఖ్యం కాదు.. వాళ్లు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారనేది ముఖ్యం అంటూ కళ్యాణ్‌ దేవ్ ఓ కొటేషన్‌ను షేర్ చేశాడు.

దీంతో కళ్యాణ్ దేవ్‌కు మెగా ఇంట్లో అవమానం జరిగిందా? అందుకే విడిపోయాడా? దూరంగా ఉంటున్నాడా? అని జనం మాట్లాడుతున్నారు. శ్రీజతో విభేదాలు అనే మ్యాటర్ బయటకొచ్చిన తర్వాత కళ్యాణ్ దేవ్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలకు మెగా ఫ్యామిలీ సప్పోర్ట్ ఉండకపోవడం గ‌మ‌న‌ర్హం.

also read:

Oversleeping : ఎక్కువ నిద్రపోయినా సమస్యలే.. ఈ జబ్బులు సోకే ప్రమాదం!

bhumi pednekar hot stills at Sidharth, Kiara Advani reception

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News