Homebigg boss telugu season 6Bigg Boss 6: నామినేష‌న్ లో అంద‌రికి టార్గెట్ అయిన శ్రీహాన్..

Bigg Boss 6: నామినేష‌న్ లో అంద‌రికి టార్గెట్ అయిన శ్రీహాన్..

Telugu Flash News

Bigg Boss 6: ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో కేవ‌లం 9 మంది స‌భ్యులే ఉన్నారు. చివ‌రిగా మెరీనా బ‌య‌ట‌కు పోవ‌డంతో ఈ 9 మంది నామినేష‌న్ ప్ర‌క్రియ సోమ‌వారం జరిగింది. ప్రతీ సారి గొడవలు, కొట్లాటలతో.. హోరా హోరీగా ఈ సాగే ఈ ప్ర‌క్రియ‌ని ఈ సారి కొంత డిఫ‌రెంట్‌గా జ‌రిపించారు . ఒక‌రికొక‌రికి సంబంధం లేదు అన్నట్టుగా.. సీక్రేట్ రూమ్ లో జరిపించారు. ప్రతీ ఒక్కరు తాముఇంటి నుంచి బయకు పంపించాలి అనుకుంటున్నవారిని, రీజన్స్ చెప్పి మరీ రూమ్ లో నామినేట్ చేయ‌గా, ఈ సారి శ్రీహాన్ అంద‌రికి టార్గెట్‌గా మారాడు.

కీర్తి,రోహిత్, రాజ్ లు శ్రీహాన్ పై బలమైన కారణలు చెప్పి శ్రీహాన్‌ణి నామినేట్ చేయ‌గా, ఆదిరెడ్డితో పాటుగా శ్రీహాన్ ను నలుగురు నామినేట్ చేశారు… రోహిత్, ఫైమాను ముగ్గురు నామినేట్ చేశారు. రాజ్, ఆదిరెడ్డి, ఇనయా రెండు ఓట్లతో నామినేట్ అయ్యారు. కెప్టెన్ రేవంత్ క‌నుక ఆయ‌న సేవ్ అవ్వగా.. కీర్తీని ఒకే ఒక్క‌రు నామినేట్ చేయడంతో.. ఈమె సేవ్ అయ్యింది. అటు శ్రీహాన్ నాలుగు ఓట్లుపడటంతో చాలా హ‌ర్ట్ అయ్యాడు. ఎందుకు న‌న్ను శ‌త్రువులా చూస్తున్నారంటూ హ‌ర్ట్ అయ్యాడు. ఇక హౌస్ లో ఉన్నవారికిబయట నుంచి కొన్నిమెసేజ్ లు రాగా.. అందులో శ్రీసత్య, రాజ్, కీర్తీ, ఇనయా ఉన్నారు.

కీర్తీ సింపతీ కోసం ఆరాటపడుతున్నారా అనిఅడగ్గా.. సింపతీ ఎప్పటికీ పనిచేయదని, అది కొన్ని రోజులు మాత్ర‌మే ఉంటుంద‌ని కీర్తి బదులిచ్చింది. రాజ్ .. నీ వెనకాల నీ గురించి ఎవరు మాట్లాడుకుంటున్నారు అని అని అనగా.. రాజ్ సరదాగా ఇనయా పేరు చెప్ప‌డంతో ఆమె కన్నీల్లు పెట్టుకుంది ఇనయా. ఇక హౌస్ కెప్టెన్ కమ్.. రేషన్ మేనేజర్ రేవంత్ ను బంగాళదుంప కావాల‌ని కీర్తి అడ‌గ‌డంతో చిన్న‌పాటి ఇష్యూ అయింది. ఇక అర్ధ రాత్రి శ్రీసత్య, ఫైమా మేకప్ వేసుకుని కొంద‌రిని భ‌య‌పెట్టాల‌ని ప్లాన్ చేసుకున్నారు. శ్రీసత్య ను చూసి రాజ్ కాస్త ఉల్లిక్కి పడ్డాడు అంత‌గా భయపడలేదు. ఇక శ్రీసత్య శ్రీహాన్ బెడ్ మీదకు వెళ్లి భయపెట్టే ప్ర‌య‌త్నం చేసింది.

also read news:

horoscope today : 22-11-2022 మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News