Homebigg boss telugu season 6Bigg Boss 6: కెప్టెన్ అవ్వ‌గానే హౌజ్‌మేట్స్‌ని ర‌ఫ్ఫాడిస్తున్న శ్రీహాన్..!

Bigg Boss 6: కెప్టెన్ అవ్వ‌గానే హౌజ్‌మేట్స్‌ని ర‌ఫ్ఫాడిస్తున్న శ్రీహాన్..!

Telugu Flash News

Bigg Boss 6: బిగ్ బాస్ సీజ‌న్ 6 లో కొద్ది రోజులుగా కెప్టెన్సీ టాస్క్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. మొత్తానికి మిర్రర్ స్టార్ శ్రీహాన్ బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యాడు.. అయితే ఆయ‌న కెప్టెన్ కావ‌డానికి గీతు కన్నింగ్ గేమ్ కూడా ఒక‌టి అని చెప్ప‌వ‌చ్చు.

శ్రీహాన్ కెప్టెన్ అయ్యాక సింహాసనంపై కూర్చుని మీసం మెలేస్తూ ఇచ్చిన బిల్డ‌ప్ చూస్తే ఏదో బిగ బాస్ టైటిల్ పొందిన‌ట్టుగా అనిపించింది.

న్యూ కెప్టెన్ గా శ్రీహాన్ బాధ్యతలు తీసుకోవ‌డంతో. శ్రీహాన్ తో కాలు దువ్వడానికి సై అంటే సై అంటోంది ఇన‌య‌. అయితే ఇన‌య విష‌యంలో హౌజ్‌లో చాలా సేపు డిస్క‌ష‌న్ న‌డిచింది.

శ్రీహాన్ అల్టిమేటం..

ఇన‌య రంగులు మార్చడంపై పెద్ద చర్చే జ‌రిపారు. అటు కీర్తీ మాత్రం తనను అన్యాయంచేస్తున్నారంటూ తెగ బాధపడింది. హౌస్ మొత్తం మీద నువ్వే జన్యూన్ పర్సన్ అంటూ కీర్తి ఇనయాకు కితాబివ్వ‌డంతో ఆమె ఉప్పొంగిపోయింది.

ఇక కెప్టెన్ అయ్యాక‌ బిగ్ బాస్ శ్రీహాన్ కుపెద్ద పరిక్షే పెట్టాడు. హౌస్ మొత్తం మీద వరస్ట్ పర్ఫామర్ ఎవరో చెప్పి.. వారిని జైల్లో పెట్టమని చెప్ప‌డంతో శ్రీహాన్ బాలాదిత్యను సెలక్ట్ చేసుకున్నాడు.

చేప‌ల టాస్క్‌లో బాలాదిత్య పెద్ద‌గా ప‌ర్‌ఫార్మెన్స్ ఇవ్వ‌ని క్ర‌మంలో త‌న‌ను జైలులో పెట్టేశాడు. ఇక ఇంటి బాధ్య‌త‌లు తీసుకున్న శ్రీహాన్.. రేష‌న్ సంబంధించిన ప‌నులు చూసుకోవ‌డానికి రేవంత్‌ని నియ‌మించాడు.

-Advertisement-

వంట దగ్గర ఎవరు ఉంటారు అన్నదానిపై పెద్ద డిస్కర్షనే జరిగింది. ఈ విషయంలోనే ఇనయాతో మళ్ళీ గొడవే అయింది. హౌజ్‌లో చాలా మంది ప‌స్తులు ఉంటున్నారు. ద‌య‌చేసి ఎవ‌రు ఫుడ్ వేస్ట్ చేయోద్దు అని ఆర్డ‌ర్ జారీ చేశాడు.

ఇక యమహా కాల్ ఆఫ్ ది బ్లూ మెంట్‌ టాస్క్‌లో రోహిత్ విన్నర్ కాగా, కాల్ ఆఫ్ ది బ్లూ మూమెంట్‌ విన్నర్‌గా రోహిత్‌ని ప్రకటించగానే.. రేవంత్ చిన్న పిల్లాడిలా శివాలెత్తిపోయాడు. నాకు ఇవ్వకుండా అతనికి ఎలా ఇస్తావ్ అంటూ ర‌చ్చ చేశాడు.

గీతు అయితే మగాడిలో దమ్ము ఉండాలని.. అది సూర్యలో కనిపించడం లేదని అన్నది. ఇనయని ఫేక్ అని అన్నది. ఆదిరెడ్డి కూతురు బర్త్ డే సందర్భంగా ఓ మంచి వీడియోనుప్లే చేశారు టీమ్.

మరిన్ని వార్తలు చదవండి : 

horoscope today : 29-10-2022 శనివారం ఈ రోజు రాశి ఫలాలు

Viral Video: మితి మీరుతున్న రిస్కీ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌లు.. నోరెళ్ల‌పెడుతున్న నెటిజ‌న్స్

Tamanna : ప‌రువాల‌తో పిచ్చెక్కిస్తున్న త‌మ‌న్నా.. బ్యూటీ అందాల‌కు పులుపెక్కిపోతున్న ఫ్యాన్స్

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News