Homebigg boss telugu season 6Bigg Boss 6: బిగ్ బాస్ హౌజ్‌లో ఘోరాతి ఘోరాలు.. శ్రీహాన్‌ని ఇన‌య అంత మాట అనేసిందేంటి ?

Bigg Boss 6: బిగ్ బాస్ హౌజ్‌లో ఘోరాతి ఘోరాలు.. శ్రీహాన్‌ని ఇన‌య అంత మాట అనేసిందేంటి ?

Telugu Flash News

Bigg Boss 6: బిగ్ బాస్ హౌజ్ కంటెస్టెంట్స్ ర‌చ్చతో హీటెక్కిపోతుంది. హౌజ్‌మేట్స్ ఒక‌రిపై ఒక‌రు నింద‌లు వేసుకుంటూ నానా ర‌చ్చ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌజ్‌లో నామినేష‌న్స్ స‌మ‌యంలో ఇన‌య‌ని టార్గెట్ చేస్తూ అంద‌రు దారుణ‌మైన ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. దాంతో తెగ ఫీలైన ఇన‌య మ‌ళ్లీ బ్యాక్ అనేలా గేమ్ ఆడుతుంది. 60వ‌ ఎపిసోడ్‌లో శ్రీహాన్‌ని ఇన‌య దారుణ‌మైన మాట అనేసింది. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు మిషన్ పాజిబుల్ టాస్క్ ఇవ్వ‌గా, ఇందులో ఇంటి సభ్యులు రెడ్ టీం అండ్ బ్లూ టీం గా విడిపోయి గేమ్ ఆడుతున్నారు. అయితే ఈ టాస్క్ లో భాగంగా రెడ్ టీం సభ్యులు, బ్లూ టీం సభ్యులు రెండు వాల్స్ పై నిలబడతారు.

వార్ మాములుగా లేదు..

ఇక ఇంటి స‌భ్యుల‌కి కర్రలు లాంటి ఆయుధాలతో నిబంధనలు పాటిస్తూ పోరాడాల్సి ఉంటుంది. వాల్ నుంచి కింద పడిపోతే వారు అవుట్. చివరికి వాల్ పై ఏ టీం సభ్యులు ఉంటే ఆ టీం విజయం సాధించినట్లు అని బిగ్ బాస్ తెలియ‌జేస్తారు ఇక గేమ్ ప్రారంభం కాగా, ఈ రౌండ్ లో రెడ్ టీం విజయం సాధిస్తుంది. రెడ్ టీం నుంచి రేవంత్, ఫైమా , శ్రీహన్ పోటీలో పాల్గొన్నారు. బ్లూ టీం నుంచి మెరీనా, వాసంతి, ఇనయ పాల్గొన్నారు. ఇక ఇంత‌క ముందు మాదిరే గేమ్ లో భాగంగా ఇనయ, శ్రీహాన్ మధ్య చెలరేగిన వివాదం పెద్ద గొడవగా మారి నోరు జారేలా కూడా చేసింది. నామినేషన్స్ తప్ప కంటెంట్ లేని దానివి నువ్వు కూడా మాట్లాడుతున్నావ్ అంటూ శ్రీహన్ ఇనయని ఉద్దేశించి అంటాడు.

inaya sultana bigg boss 6ఆ త‌ర్వాత ఇనయ కూడా నువ్వు ఎవరి బెడ్ పై పడుకుంటున్నావో తెలుసు అంటూ ఘాటు కామెంట్స్ చేసింది. గేమ్ పూర్తయిన తర్వాత ఇనయని శ్రీహాన్ ప్ర‌శ్నిస్తాడు. శ్రీసత్యతో రిలేషన్ పై ఇనయ పరోక్షంగా ఆ కామెంట్స్ చేసింద‌రి శ్రీహాన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌గా, శ్రీసత్య కూడా ఇనయపై ఆగ్రహంతో చెలరేగిపోతుంది. ఇనయ నోట్లో అశుద్ధం పెట్టుకుని మాట్లాడుతోంది అంటూ శ్రీహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గేమ్ చివ‌ర‌లో ఆదిరెడ్డికి బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. బాత్ రూమ్ ని డర్టీగా మార్చి రెడ్ టీం సభ్యులలో ఒకరిపై నింద వేయాల్సి ఉంటుంది చెప్పారు. ఇలా చేస్తే మీ టీంలో మరణించిన ఒక సభ్యుడిని బతికించే ఛాన్స్ ఉంటుందని బిగ్ బాస్ చెప్ప‌డంతో ఆదిరెడ్డి ఆ సన్నాహాల‌లో ఉన్నాడు.

read more news :

horoscope : 3-11-2022 ఈ రోజు మీ రాశి ఫలితాలను చూడండి..

Vecan Foods : ప్రోటీన్ ఉత్పత్తులను తయారుచేసి వ్యాపారవేత్తలుగా మారిన తల్లులు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News