Homebigg boss telugu season 6Bigg Boss 6: బాబోయ్ ఇదేం ర‌చ్చ‌.. అర్ధ‌రాత్రి శ్రీహాన్ దుప్పట్లోకి శ్రీస‌త్య..!

Bigg Boss 6: బాబోయ్ ఇదేం ర‌చ్చ‌.. అర్ధ‌రాత్రి శ్రీహాన్ దుప్పట్లోకి శ్రీస‌త్య..!

Telugu Flash News

Bigg Boss 6: బిగ్ బాస్ సీజ‌న్ 6 మ‌రి కొద్ది రోజుల‌లో ముగియ‌నుంది. గేమ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌డంతో హౌజ్‌లో కెప్టెన్సీ టాస్క్ వంటి వాటికి పులిస్టాప్ పెట్టారు బిగ్ బాస్. కేవ‌లం ఎంట‌ర్‌టైన్‌మెంట్ మీద దృష్టి పెట్టడంతో పాటు గతంలో కోల్పోయిన ప్రైజ్‌ మనీని తిరిగి పొందేందుకు వివిధ రకాలు టాస్క్ ఇస్తున్నాడు . ఇందులో భాగంగా సోమవారం నిర్వహించిన మొదటి టాస్క్ లో హౌజ్‌మేట్స్ ఫెయిల్‌ అయ్యారు. ఇక మంగళవారం నిర్వహించిన రెండో టాస్క్ రేవంత్‌-ఇనయ మధ్య జ‌రిగింది. కప్పులు పేర్చే టాస్క్ లో రేవంత్‌ గెలవడంతో లక్ష పది వేల రూపాయలు పొందారు.

మూడో టాస్క్ లో ఆదిరెడ్డి-కీర్తి, శ్రీహాన్‌-శ్రీ సత్య మధ్య జరిగింది. మనీ నెంబర్స్ ఉన్న కార్డులను బాక్సుల్లో పడేయాల్సి ఉంటుంది. ఇందులో శ్రీ హాన్‌-శ్రీ సత్య గెలిచారు. అయితే ఇంటి సభ్యులు కీర్తి-ఆదిరెడ్డి గెలస్తారని ఊహించి చెప్ప‌డంతోఈ టాస్క్ లో లక్ష రూపాయలు గెలవడంలో విఫలమయ్యారు. అనంతరం సాండ్‌ని తమ బాటిల్స్ లో నింపే టాస్క్ లో రేవంత్‌, ఇనయ పాల్గొన్నారు. ఇందులో రేవంత్‌ విన్నర్‌ అయ్యారు. అయితే ఇంటి సభ్యులు కూడా ఆయనపేరే చెప్పడంతో ఈ టాస్క్ లో రెండు లక్షలు తిరిగి పొందారు. దీంతో బిగ్‌ బాస్‌ విన్నర్‌ ప్రైజ్‌ మనీ 41 లక్షల అయ్యింది.

అనంతరం రాత్రి సమయంలో బిగ్‌ బాస్‌ హౌజ్‌లో విచిత్రం చోటు చేసుకుంది. శ్రీస‌త్య త‌న జీవితంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న గురించి చెబుతుండ‌గా, హౌజ్‌లో గట్టిగా అరిచిన శబ్దం వచ్చింది. దీంతో అంతా ఒక్కసారిగా భయపడ‌గా, శ్రీ సత్య అయితే ఏకంగా వెళ్లి శ్రీహాన్ దుప్పట్లో దూరింది. శ్రీహాన్ కూడా భయబ్రాంతులకు గురయ్యారు. ఆ తర్వాత మరోసారి శబ్దం రావడంతో తెగ భ‌య‌ప‌డిపోయాడు. మరోవైపు ఇనయ కాసేపు దెయ్యం పట్టిన అమ్మాయిలా వ్యవహరించి భ‌య‌పెట్టించింది. ఆదిరెడ్డి టార్గెట్‌గా ఆమె దెయ్యంగా యాక్ట్ చేసింది.మొత్తానికి తాజా ఎపిసోడ్ స‌ర‌దాగా సంద‌డిగా సాగింది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News