Homecinemaశ్రీముఖి తో బిగ్ బాస్ సోహైల్ గొడ‌వ‌.. సీరియ‌స్ వార్నింగ్

శ్రీముఖి తో బిగ్ బాస్ సోహైల్ గొడ‌వ‌.. సీరియ‌స్ వార్నింగ్

Telugu Flash News

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు శ్రీముఖి. ఈ అమ్మ‌డు ఒక‌ప్పుడు స్లో అండ్ స్ట‌డీగా షోలు చేసేది. కాని ఇప్పుడు మాత్రం దూసుకుపోతుంది. ప‌లు ఛానెల్స్‌లో వైవిధ్య‌మైన షోలు చేస్తూ దుమ్ము లేపుతుంది. శ్రీముఖి ఆ షోలో ఉంటే ఎన‌ర్జీనే వేరే లెవ‌ల్ లో ఉంటుంది. బిగ్ బాస్ షో త‌ర్వాత ఈ అమ్మ‌డికి క్రేజ్ మ‌రింత పెరిగింది. యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి ప్రస్తుతం సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ రాకెట్‌లా దూసుకుపోతుంది. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా కుర్రాళ్లకి చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది.

ఎప్పుడు లేని విధంగాశ్రీముఖి రెచ్చి పోయి అందాలు ఆర‌బోత‌తో కుర్రాళ్ల‌కి మ‌తులు పోగొట్టేసింది. ఒకవైపు యాంకరింగ్ తో అదరగొడుతూనే మరోవైపు డాన్స్ ఐకాన్ అనే షోలో టీం లీడర్ గా కూడా శ్రీముఖి వ్యవహరిస్తుంది ఈ కార్యక్రమానికి ఓంకార్ హోస్టింగ్ చేస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఈ షోకి టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, వర్సటైల్ యాక్టర్ రమ్యకృష్ణ జడ్జిలుగా వ్యవహరిస్తూ ఉండ‌గా, బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ కూడా సందడి చేశాడు. టీమ్ లీడర్ మోనాల్ స్థానంలో ఇక షోకి ఎంట్రీ ఇచ్చిన సోహెల్ తనదైన జడ్జిమెంట్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు.

తాజాగా షోకి సంబంధించిన ప్రోమో విడుద‌ల కాగా, ఇందులో శ్రీముఖి సోహెల్ మధ్య పెద్ద గొడవ జ‌రిగిన‌ట్టు చూపించారు. అదే సమయంలో ఇక జడ్జి సీట్లో కూర్చున్న రమ్యకృష్ణ కూడా ఫుల్ సీరియస్ అయింది.. శ్రీముఖి టీం నుంచి ఆసిఫ్ అండ్ రాజు కలిసి నాటు నాటు పాటుకు డాన్స్ చేయ‌గా, వారి పర్ఫామెన్స్ కి సోహెల్ రెడ్ కార్డ్ చూపించాడు. దానికి ఎంతో హర్ట్ అయినా శ్రీముఖి ఇది మోనాల్ కూర్చున్న సీట్ ప్రభావం అంటూ గొడవకి దిగింది. డాన్స్ ఐకాన్ లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని సోహెల్ స‌మాధానం చెప్ప‌గా, రమ్యకృష్ణ మేము ఇక్కడ ఎందుకు ఉన్నాం.. జడ్జిమెంట్ చెప్పడానికే కదా అంటూ ఫుల్‌ సీరియస్ అయింది. ప్రోమో చూస్తుంటే మాత్రం ఇద్ద‌రి మ‌ధ్య ఫైట్ గ‌ట్టిగానే సాగిన‌ట్టు తెలుస్తుంది.

also read news:

షుగర్ వ్యాధి తగ్గాలంటే.. మెంతులతో ఇలా చేయండి..

వీర్యవృద్ధి, స్త్రీల సంతాన ప్రాప్తి కి పాటించాల్సిన చిట్కాలు..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News