HomecinemaSreemukhi: రోజు రోజుకి పెరిగిపోతున్న శ్రీముఖి క్రేజ్.. సైమా కోసం అంత డిమాండ్ చేసిందా?

Sreemukhi: రోజు రోజుకి పెరిగిపోతున్న శ్రీముఖి క్రేజ్.. సైమా కోసం అంత డిమాండ్ చేసిందా?

Telugu Flash News

Sreemukhi: బుల్లితెర‌పై త‌న మాట‌ల‌తో కోట్లాది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంటున్న అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి. ప‌టాస్ షోతో పేరు తెచ్చుకున్న శ్రీముఖి.. బిగ్ బాస్ షోతో త‌న రేంజ్ మ‌రింత పెంచుకుంది. బిగ్ బాస్ షోలో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచి త‌న స‌త్తా ఏంటో నిరూపించుకుంది శ్రీముఖి. ఇక ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు టీవీ షోస్‌, సినిమాల‌తో తెగ సంద‌డి చేస్తుంది.

ఇటీవల సరిగమప షో ద్వారా టెలివిజన్ ప్రియులను అలరించగా, రీసెంట్‌గా జ‌రిగిన సైమా అవార్డ్స్ వేడుకలలో మెరిసింది. బెంగుళూరులో జరిగిన సైమా అవార్డ్స్ 2022 వేడుకలకు యాంకర్‏గా వ్యవహరించి తన మాటల గారడీతో వేడుకలకు వచ్చిన సెలబ్రెటీలను మెప్పించింది.

ద‌టీజ్ శ్రీముఖి..

న‌టుడు ఆలీతో క‌లిసి హోస్ట్ చేసిన శ్రీముఖి.. రెండు రోజుల‌కి గాను ఏకంగా రూ. 15 లక్షలు తీసుకున్నారట. ప్రయాణ, హోటల్ ఖర్చులు తీసేసినా శ్రీముఖికి రూ. 14 లక్షల రూపాయల వ‌ర‌కు మిగిలి ఉంటాయ‌ని అంటున్నారు.

మొత్తానికి సైమాతో శ్రీముఖి బాగానే వెన‌కేసుంద‌ని తెలుస్తుంది. ఇక ఇటీవ‌ల భోళా శంక‌ర్ అనే చిత్రంలో న‌టించిన శ్రీముఖి ఆ చిత్రానికి కూడా గ‌ట్టిగానే రెమ్యున‌రేష‌న్ అందుకుంద‌నే టాక్ వినిపిస్తుంది. కాగా, శ్రీముఖి నేను శైలజ, మ్యాస్ట్రో, జులాయి, క్రేజీ అంకుల్స్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

‘జులాయి’ అనే సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా న‌టించిన శ్రీముఖి ఈ సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసి ఫుల్ పాపులర్ అయింది.

ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే సినిమాలు త‌న‌కు కలిసి రావ‌ట్లేద‌ని భావించిన ఈ ముద్దుగుమ్మ యాంకర్‌గా మారి మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.

-Advertisement-

మరిన్ని వార్తలు చదవండి :

Prabhas- Anushka: మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారిన ప్ర‌భాస్‌- అనుష్క‌ల పెళ్లి.. సడెన్‌గా ఈ ట్విస్ట్ ఏంది?

Pranitha Subhash: పెళ్లి త‌ర్వాత తొలిసారి బికినీలో క‌నిపించి షాక్ ఇచ్చిన ప్ర‌ణీత‌

Samantha: కోట్లు సంపాదిస్తున్న స‌మంత ఆ డ‌బ్బుల‌ని వేటికి ఎక్కువ ఉప‌యోగిస్తుందో తెలుసా?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News