HomesportsVirat Kohli: నేను బౌలింగ్‌ వేసుంటే.. 40 పరుగులకే ఆర్ఆర్ ఫసక్‌.. కోహ్లీ కామెంట్స్‌!

Virat Kohli: నేను బౌలింగ్‌ వేసుంటే.. 40 పరుగులకే ఆర్ఆర్ ఫసక్‌.. కోహ్లీ కామెంట్స్‌!

Telugu Flash News

Virat Kohli: ఐపీఎల్‌ 2023 సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. ప్లేఆఫ్‌ చేరే నాలుగు జట్లు ఏవనే దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. మొదటి జట్టుగా గుజరాత్‌ టైటాన్స్‌ తన బెర్త్‌ను ఖాయం చేసుకుంది. రెండో జట్టుగా సీఎస్కే ముందజలో ఉన్నప్పటికీ కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఓటమిపాలవడంతో సీఎస్కే పరిస్థితి కూడా అంచనా వేయడానికి లేకుండా ఉంది. అయితే, ఆర్సీబీ జట్టు మాత్రం ప్లేఆఫ్‌ ఆశల్ని సజీవం చేసుకుంది. లీగ్‌లో తమ 12వ మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో ఆడింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 112 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.

ఈ విజయం తర్వాత ఆర్సీబీ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను బౌలింగ్ చేసి ఉంటే రాజస్థాన్ జట్టు వాళ్లంతా 40 పరుగులకే ఆలౌట్ అయ్యేవారంటూ కామెంట్స్‌ చేశాడు. ఆర్సీబీ, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ..172 పరుగులు సాధించింది. ఛేజింగ్‌కు దిగిన రాజస్థాన్ జట్టు కేవలం 10.3 ఓవర్లలో 59 పరుగులే చేసి ఆలౌటైంది. ఇది ఐపీఎల్‌లో రాజస్థాన్‌కు రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఐపీఎల్‌ హిస్టరీలో మూడో అత్యల్ప స్కోరుగా కూడా ఇది రికార్డులకెక్కింది.

రాజస్తాన్‌ బ్యాటర్లకు ఆర్సీబీ బౌలర్లు చుక్కలు చూపించారు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. తాను బౌలింగ్ చేసి ఉంటే ఆర్ఆర్ ప్లేయర్స్ 40 పరుగులకే ఆలౌట్ అయ్యేవారని వ్యాఖ్యానించాడు. ఈ వీడియోను ఆర్సీబీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు అద్భుతమైన ఫామ్‌తో కనిపించారు. జట్టు తరపున ఫాస్ట్ బౌలర్ వేన్ పార్నెల్ 3 ఓవర్లకు 10 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. దీంతో పాటు మైకేల్ బ్రేస్‌వెల్, కర్ణ్ శర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు. బ్రేస్‌వెల్ 3 ఓవర్లలో 16 పరుగులు ఇవ్వగా, కర్ణ్ శర్మ 1.3 ఓవర్లలో 19 రన్స్‌ ఇచ్చాడు.

ఇక ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మియా 2 ఓవర్లలో 10 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకోగా, గ్లెన్ మాక్స్ వెల్ 1 ఓవర్లో 3 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా నిలిచాయి. మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడి ఉంటే ఆ జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించేది. ఈ విజయం తర్వాత ఆర్సీబీ 12 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సాధించగలిగింది. ఇప్పుడు ఆ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే ప్లేఆఫ్‌ బెర్త్‌ ఖాయం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Read Also : Viral Video: భానుడి భగభగ.. రోడ్డుపై స్కూటీలో స్నానం చేసిన లవర్స్‌.. ఇదేం విడ్డూరం!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News