Ruturaj Gaikwad: రెండు నెలలపాటు అభిమానులను అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసింది. ఐపీఎల్ 16వ సీజన్ ట్రోఫీని చెన్నై సూపర్ కింగ్స్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ధోని నాయకత్వంలో ఐదోసారి టైటిల్‌ను చేజిక్కించుకున్నారు. సోమవారం జరిగిన ఫైనల్ పోరు ఉత్కంఠ భరితంగా సాగింది. మ్యాచ్ అనంతరం క్రికెటర్లంతా తమ ఫ్యామిలీలతో కలిసి కెమెరాలకు పోజులిచ్చారు. ఇలా ఉంటే.. సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే ఇంటి వాడు కాబోతున్నానని చెప్పాడు.
రుతురాజ్ గైక్వాడ్ ఓ అందమైన అమ్మాయితో కలిసి కెమెరాల ముందు కనిపించడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె ఎవరో కాదు.. రుతురాజ్‌కు కాబోయే సతీమణే అని తేలింది. ఆమె పేరు ఉత్కర్ష. రుతురాజ్-ఉత్కర్ష జంట కాబోతున్నారు. వీరి వివాహ తేదీ కూడా ఖరారైపోయిందని తెలుస్తోంది. జూన్ 3-4 తేదీల్లో వైభవంగా వీరి పెళ్లి నిర్వహించేందుకు ఏర్పాట్లు చక చకా జరిగిపోతున్నాయట. అందుకే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ నుంచి కూడా రుతురాజ్ విశ్రాంతి తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
రుతురాజ్ గైక్వాడ్ ఏజ్ ప్రస్తుతం 26 ఏళ్లు. రుతురాజ్ తొలిసారి 2020 ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సీజన్‌లో సీఎస్కే తరఫున కేవలం ఆరు మ్యాచ్‌లలోనే అవకాశం లభించింది. అయితే 204 పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం 2021 సీజన్‌లో అన్ని మ్యాచ్‌లలోనూ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఏకంగా 635 రన్స్‌తో మెరిశాడు. గతేడాది కూడా 368 పరుగులు చేశాడు. ఈసారి మాత్రం 590 పరుగులతో సరిపెట్టాడు. అయినప్పటికీ సీఎస్కే బెస్ట్ ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్నాడు. సీఎస్కే విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
రుతురాజ్ ఇప్పటికే టీమిండియా తరఫున కొన్ని టీ 20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. ఇక వన్డే, టెస్ట్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేయాల్సి ఉంది. మొదటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఓపెనర్లే బలం, బలగం. ఓ ఫారిన్ ప్లేయర్, ఇండియన్ యవ క్రికెటర్‌తో కూడిన ద్వయం.. దాదాపు అన్ని సీజన్లలోనూ కనిపిస్తారు. డ్వేన్ కాన్వేతో కలిసి రుతురాజ్ మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ధోని రిటైర్‌మెంట్ తర్వాత సీఎస్కే భావి కెప్టెన్‌గా రుతురాజ్‌ను మేనేజ్‌మెంట్ భావిస్తోంది. దీంతో రుతురాజ్‌పై మరింత బాధ్యత ఏర్పడుతోంది.
https://www.instagram.com/p/Cs2F-juPQyy/?utm_source=ig_web_copy_link&igshid=MmJiY2I4NDBkZg==
Read Also : Ajinkya Rahane : టెస్టులకు కూడా పనికిరాడన్నారు.. ఇప్పుడు సిక్సర్ల సునామీ సృష్టిస్తున్నాడు!