IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్కే ఒకవైపు.. డిఫెండింగ్ చాంపియన్‌గా నిలిచిన గుజరాత్ మరోవైపు. ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్ కూడా వీళ్లిద్దరి మధ్యే జరిగింది. ఈ రెండు జట్లు మొదటి లాస్ట్ మ్యాచ్‌లో కూడా తలపడటం సరికొత్త విషయం. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని కోసమే ఐపీఎల్ వీక్షించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. అందుకు కారణం కూడా ఉంది. ధోని రిటైర్‌మెంట్‌పై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఆట తీరు, మైదానంలో ప్రెజెన్స్ కోసం ప్రేక్షకులు ఆత్రంగా ఎదురుచూస్తుంటారు.
కాగా, తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లోనూ ఈ రెండు జట్లే తలపడ్డాయి. మొత్తంగా ఆ లీగ్‌లో మూడో సారి ఇరుజట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటూ లాస్ట్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ అరంగేట్రం చేసింది. అయితే, డామినేషన్ మాత్రం సీఎస్కేపై జీటీదే. గణాంకాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ సీజన్‌లో కూడా ఒక మ్యాచ్ మినహా రెండు మ్యాచ్‌లు జీటీ గెలిచింది. తొలి మ్యాచ్‌లోనూ గుజరాత్, క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నైగెలిచాయి. ఇక మూడో మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.
10వ సారి ఐపీఎల్ ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్.. కొత్త రికార్డ్ నెలకొల్పింది. మహేంద్రసింగ్ ధోని సారథ్యంలోని సీఎస్కే టీమ్.. ఇప్పటి దాకా నాలుగు సార్లు ఐపీఎల్ టోర్నీని కైవసం చేసుకుంది. నాలుగు టైటిళ్లు గెలవడంలో ధోని పాత్రే అత్యధికంగా ఉంటుంది. ఎందుకంటే ధోని కెప్టెన్సీ అంటే అన్ని వైపులా పదునుగా ఉంటుంది. ఫీల్డింగ్, బౌలింగ్‌ను సెట్‌చేయడంలో ధోని వ్యూహాలు వేరే లెవల్‌లో ఉంటాయి. ఐపీఎల్‌లో అడుగుపెట్టిన తొలి ఏడాదే కప్ కొట్టిన గుజరాత్ టీం కూడా పలు రికార్డులు సృష్టించింది.
ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలుస్తోంది. నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పరుగుల వరదను ప్రేక్షకులు చూడొచ్చు. ఈ స్టేడియంలో 5 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన టీమ్స్ విక్టరీ సాధించాయి. శుభ్ మన్ గిల్ పై గుజరాత్ టైటాన్స్ జట్టు గంపెడాశలు పెట్టుకకుంది. అదే క్రమంలో ధోని వ్యూహాల ముందు హార్దిక్ పాండ్య సేన నిలువగలదా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇదే స్టేడియంలో రెండు వరుస సెంచరీలను గిల్ నమోదు చేశాడు. ఇంకో మ్యాచ్ లో 94 రన్స్ చేయడం ప్లస్ పాయింట్.
Read Also : IPL 2023: చల్లారిన వివాదం.. దాదాతో చేతులు కలిపిన విరాట్ కోహ్లీ